ఏపీలో మరొకొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు వ్యూహాలు రచిస్తూ తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అయితే ఈ సమయంలో నేతలు వేసే ప్రతి అడుగు కూడా ఎన్నికలపై ప్రభావం చూపేదే. పరీక్షలకు ముందు ఏ విధంగా చదివారు అనే దానిపై విద్యార్థి ఫలితాలు ఎలా ఆధారపడి ఉంటుందో.. అలాగే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల వ్యూహాలపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.


అధికార వైసీపీ సిద్ధం పేరుతో పలు బహిరంగ సభలు నిర్వహించింది. ఇప్పటి వరకు భీమిలి, దెందులూరు, రాప్తాడులో సిద్ధం సభలు నిర్వహించింది. ఈ సభలన్నీ ఒకదాని మించి మరొకటి విజయవంతం అయ్యాయి. ఇదే సందర్భంలో చివరి సారి నిర్వహించిన సభకు ఊహించిన దాని కంటే భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న లెక్కల ప్రకారం దక్షిణ భారత దేశంలో రాజకీయ సభకు ఇంతమొత్తంలో జనం హాజరు కావడం ఇదే ప్రథమం అని చెబుతున్నారు.


అయితే సిద్ధం సభలకు పోటీగా కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన లు కలిసి జెండా పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా తాడేపల్లిలో నిర్వహించిన జెండా సభ ఆశించిన మేర కార్యకర్తలు తరలిరాలేదని పలువురు పేర్కొంటున్నారు. సాధారణంగా ఎకరానికి సుమారు 40నుంచి 50 వేల మంది జనాభా పడతారు. కానీ అక్కడ టీడీపీ నేతలు చెప్పిన విధంగా నాలుగైదు లక్షల మంది జనాలు హాజరు కాలేదు. ఒకవేళ సభ అంత విజయవంతం అయితే ఆ ఉత్సాహం వేరే ఉండేది.


రాజకీయాల్లో బలాబలాలు చూపించేందుకే సభలు, సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఇందులో టీడీపీ వెనకపడిందనే చెప్పవచ్చు. కాకపోతే దెందులూరు సిద్ధం సభను పోల్చితే ఈ సభకు ఆ రేంజ్ లో  ప్రజలు రాలేదు. ఇప్పుడు తాజాగా నాలుగో సిద్ధం సభకు వైసీపీ సమాయత్తమవుతోంది.  జనసేన, టీడీపీ కూటమి వీటికి మించి సభలు నిర్వహిస్తుందా.. లేక పోరుబాట, శంఖారావం వంటి సభలకే పరిమితం అవుతుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: