
మోడీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం జరిగిందని షర్మిలా ఆరోపించారు. విభజన చట్టంలో మౌలిక సదుపాయాల కల్పన కేంద్ర బాధ్యతగా పేర్కొన్నప్పటికీ, అమరావతి అభివృద్ధికి ఎలాంటి చట్టబద్ధత లేదని ఆమె గుర్తు చేశారు. 2015 నుంచి అమరావతిని పూర్తి చేసినట్లు మోడీ అబద్ధాలు చెబుతున్నారని, కానీ రాజధాని నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదని ఆమె సూటిగా నిలదీశారు. విభజన హామీలపై సమయ పరిమితి లేకుండా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని ఆమె తప్పుబట్టారు. రాష్ట్ర ప్రజల కలల సౌధమైన అమరావతిని నిర్మించేందుకు కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా షర్మిలా తీవ్ర విమర్శలు చేశారు. మోడీని నమ్మి చంద్రబాబు పదేపదే మోసపోతున్నారని, ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆమె సూచించారు. రాష్ట్రం ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పుల్లో మునిగి ఉందని, అయినప్పటికీ అమరావతి నిర్మాణానికి 60 వేల కోట్ల అప్పు తీసుకోవడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో వంటి సంస్థల దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం సరికాదని ఆమె హెచ్చరించారు. అప్పుల భారంతో భావితరాలను ఇబ్బందుల్లోకి నెట్టడం ఎందుకని ఆమె చంద్రబాబును నిలదీశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు