జీవీఎంసీ మేయర్ పీఠం మీద కూర్చొన్న తెలుగుదేశం మేయర్ మీద అప్పుడే కూటమి కార్పొరేటర్ల లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. జీవీఎంసీ మేయర్ ను ఎన్నుకుని ఐదు నెలలు గడిచాయో లేదో ఇంతలోనే అంత వ్యతిరేకత రావటం విశేషం. మేయర్ వ్యవహార శైలి టిడిపి పోకడల వల్ల కూటమిలోని మిత్రులతో పాటు వైసిపి నుంచి కూటమి పార్టీలోకి జంప్ చేసి కూటమికి మద్దతు పలికిన 27 మంది కార్పొరేటర్లలో చాలామంది తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని విశాఖ రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. జీవీఎంసీ స్టాండింగ్ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ చేశారు అని అంటూ 18 మంది కూటమి కార్పొరేటర్ల మీద వేధింపులు మొదలుపెట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. వారు ఎవరు గుర్తించి మరి ఇబ్బంది పెడుతున్నారని చెబుతోంది.
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో సీక్రెట్ బ్యాలెట్ లో ఓటు వేసిన వారి వివరాలు బయటకు ఎలా వచ్చాయని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎవరెవరు ఓటు వేశారో ? కూటమి నాయకులకు ఎలా తెలుసు అని దీనిని ఎలక్షన్ అపెన్స్ గా పరిగణించాలని వైసీపీ చెబుతోంది. జనరల్ సీట్లో బీసీ మహిళను విశాఖ మేయర్ గా వైసీపీ కూర్చోబెట్టింది. తర్వాత టిడిపి కూటమి విశాఖ మేయర్ పెట్టాలని కైవసం చేసుకుంది. తాము పార్టీ మారిన కార్పొరేటర్ల పై అనర్హత వేటు వేయాలని కోరినా .. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు పార్టీ మారిన కార్పొరేటర్ల పై మేయర్ వేధింపులకు దిగటం ఎంతవరకు సమంజసం ? అని వైసిపి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరో 6 నెలలలో ముగిసిపోయే ఈ పదవి విషయంలో ఇంకెన్ని రాజకీయాలు చోటు చేసుకుంటాయో అన్నది విశాఖ రాజకీయ వర్గాలలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు