
లోకేష్ ఈ ప్రయాణాన్ని దీపావళి సమయంలోనూ చేపట్టడం ప్రత్యేకం. రాష్ట్ర ప్రగతి కోసం పండుగలను మరచి పనికి పరిమితం అవడం గొప్ప విషయం. ఈ టూర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ స్థాయిలో మరింత బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సిడ్నీలో లోకేష్ ప్రవేశించిన వెంటనే తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు వారిని కలవడం ద్వారా రాష్ట్రంతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలని లోకేష్ ఉద్దేశ్యం.
ఈ సమావేశం ద్వారా పెట్టుబడులు విద్యా అవకాశాలపై చర్చలు జరుగుతాయి. బ్రిస్బేన్ గోల్డ్ కోస్ట్ మెల్బోర్న్ లాంటి నగరాల్లో మంత్రులు పరిశ్రమల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు. విద్యా నవీకరణలు ఆవిష్కరణలు వ్యవసాయం క్రీడా మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడం జరుగుతుంది. ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ ఆధ్వర్యంలో మెల్బోర్న్‌లో అంతర్జాతీయ విద్యా రౌండ్‌టేబుల్ చర్చల్లో లోకేష్ పాల్గొంటారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశలు చూపిస్తాయని అభిప్రాయం.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు