తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలన తర్వాత కొత్త ప్రతిజ్ఞ చేశారు. నిన్నటి వరకూ ఒక లెక్క.. సమిట్ తర్వాత ఇంకో లెక్క ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత పాలనలో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను సరిచేశామన్నారు. రుణభారంతో వెన్ను విరిగిన రైతుకు రుణమాఫీ ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు రూ.500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాలతో అదానీ అంబానీల లెక్కలను వ్యాపారరంగంలో నిలిపామన్నారు.

రెండేళ్లలోనే ఇందిరమ్మ ఇళ్లు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సన్నబియ్యం సన్న ధాన్యానికి రూ.500 బోనస్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. బలహీన వర్గాల వందేళ్ల కల అయిన కులవర్గీకరణను నెరవేర్చి మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత ఇచ్చామన్నారు. చదువే బతుకు తెరువు అని నమ్మి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీలకు శంకుస్థాపన చేశామన్నారు.

జయ జయహే తెలంగాణ పాటకు అధికారిక గీతంగా గుర్తింపు ఇచ్చి ప్రజాకవి అందెశ్రీ కలను సాకారం చేశామన్నారు.సమ్మిట్ ప్రసంగంలో రేవంత్ 2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలనే దీర్ఘకాలిక దృష్టిని వివరించామన్నారు. గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్‌కు ప్రాణం పోసినట్టు చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీని రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్కగా పేర్కొన్నారు.

భారత్ దేశ గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణను మార్చేందుకు సర్వం సిద్ధం చేశామని ప్రకటించారు.నిన్నటి దాకా ఒక లెక్క అయితే సమ్మిట్ తర్వాత మరో లెక్క అవుతుందని రేవంత్ ధైర్యంగా ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదమే తన ఆయుధమని గుండెలు నిండా చెప్పారు. ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్‌కు తిరుగు లేదని ఘంటాపథంగా ప్రకటించారు.

 9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: