నెల్లూరు సిటీ నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న పొంగూరు నారాయణ... ఫ్యామిలీ మొత్తం విద్యా రంగంలో ఉంది. అయితే.. 2014లో చంద్రబాబు చేసిన `వస్తున్నా మీ కోసం` యాత్ర ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నారాయణ.. ఆ తర్వాత.. బాబు అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ అయ్యారు. అనంతరం మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. 2019లో వైసీపీ హవాతో ఆయన నెల్లూరు నుంచి పోటీ చేసినా.. పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కేసుల్లో చిక్కుకున్నారు.
ఇదిలావుంటే.. 2024 ఎన్నికలు నారాయణకు కలిసి వచ్చాయి. నెల్లూరు సిటీలో బలంగా ఉన్న అప్పటి మంత్రి అనిల్ కుమార్‌ను వైసీపీ తప్పించింది. ఆయనను నరసరావుపేట నుంచి రంగంలోకి దింపింది. అయితే.. అనిల్ ఓడిపోయారు. అనంతరం.. ఆయన నెల్లూరుకు తిరిగి వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి తిరిగి పోటీకి రెడీ అవుతున్నారు. స్థానికంగా బలమైన నాయకుడు, యువతను ప్రభావితం చేసే నేత కావడంతో అనిల్ విషయంలో మంత్రి అలెర్ట్ అవుతున్నారు.
వచ్చే ఎన్నికల్లోనూ విజయం దక్కించుకోవాలంటే.. ఇప్పటి నుంచే అలెర్టు కావడం ముఖ్యమని భావించి న ఆయన తరచుగా నియోజకవర్గంలోనే కాదు.. జిల్లాలోనూ తిరుగుతున్నారు. దీనికితోడు.. ఆయన సతీ మణి, పిల్లలు కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. స్థానికంగా ప్రజాదర్బార్‌లు వారే నిర్వహిస్తున్నా రు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేసమయంలో ప్రజలకు అందు బాటులో కూడా ఉంటున్నారు. మొత్తంగా మంత్రిగా నారాయణ బిజీగా ఉన్నప్పటికీ.. జిల్లా రాజకీయాలపై పట్టు పెంచుకునేలా వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి