ఏపీఎస్ ఆర్టీసీలో ఏకంగా 5000 ఉద్యోగాలకు అవకాశం లభించింది. విజయనగరం, విజయవాడ, కడప, నెల్లూరు జోన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల నియమాక ప్రక్రియ మొత్తం ఏప్రిల్ 15వ తేదీ లోగా పూర్తి చేస్తారు.

 

 

ఇవి అప్రెంటీస్ ఉద్యోగాలు... వీటికి క్వాలిఫికేషన్ పదో తరగతితో పాటు ఐటీఐ ఉండాలి. అభ్యర్థులు తమ తమ దరఖాస్తులను www.apprenticeship.gov.in వెబ్సైట్ నందు అప్ లోడ్ చేసుకోవాలి. ఇందుకు గడువు తేదీ 21-03-2020. దరఖాస్తు చేస్తుకున్న అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన సంబంధిత జోన్ల శిక్షణా కళాశాలల కమిటీలు ఏప్రిల్ 9వ తేదీన ఉంటుంది.

 

 

ఎంపికైన అప్రెంటీస్ లకు ఒక్కొక్కరికీ రూ.6931/ స్టైఫండ్ చెల్లిస్తారు. అప్రెంటీషిప్ పూర్తియిన తర్వాత ఆర్టీసీలోనే పర్మినెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ 13వ తేదీన అప్రెంటీస్ లు గా ఎన్నికైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఏపీఎస్ ఆర్టీసీ 2017 నుండి ప్రతి ఏడాది 1390 మంది ఐ.టి.అర్హత కలిగిన అభ్యర్థులను అప్రెంటిస్ లుగా నియామకం జరుపుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: