ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ క‌రోనా వైర‌స్ ప్ర‌జ‌ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. కంటికి క‌నిపించ‌ని అతిసూక్ష్మజీవి క‌రోనా.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. ఇక ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. క‌రోనా లాక్‌డౌన్ ప్రభావంతో కోట్లాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయారు. సూపర్‌వైజర్లుగా, ప్రయివేట్ టీచర్లుగా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలుగా చేసిన వారు ఇప్పుడు నిరుద్యోగులుగా మారి.. నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. కొంద‌రైతే ఉద్యోగం పోయింద‌న్న బాధ‌తో ఆత్మ‌హ‌త్య‌లు కూడా చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో ప‌లు కంపెనీలు మాత్రం నిరుద్యోగుల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్.. ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తూ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 53 ఖాళీలున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ రిక్రూట్మెంట్ సంబంధించి పూర్తి వివరాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 53 ఖాళీలు ఉండ‌గా.. అందులో ప్రొఫెసర్- 4, అసిస్టెంట్ ప్రొఫెసర్- 40, లైబ్రేరియన్- 1, అసోసియేట్ ప్రొఫెసర్- 8 పోస్టులున్నాయి. విద్యార్హ‌త విష‌యానికి వ‌స్తే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

అయితే సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇక  ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ద‌ర‌ఖాస్తు చేయడానికి 2020 ఆగస్ట్ 15 చివరి తేదీగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ నోటిఫికేష‌న్‌లో వెల్ల‌డించింది. ఆస‌క్త‌గ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుని.. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. దరఖాస్తుల్ని చివరి తేదీ లోగా పోస్టులో పంపాల్సి ఉంటుంది. కాగా, ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ అధికార‌క వెబ్‌సైట్‌ http://www.iaseuniversity.org.in/ ను ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.   

మరింత సమాచారం తెలుసుకోండి: