ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్ పై దృష్టి సారించారు. ఇప్పటికే నిరుద్యోగ సమస్య నుంచి బయటపడే మార్గాలను అందుబాటు లోకి తీసుకొస్తున్నారు. సెంట్రల్ గవ్నమెంట్ జాబ్స్ కొరకు ధరకాస్తు చేసుకొనే వారికి అధ్బుతమైన అవకాశాలను అందిస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న అన్నీ పరీక్షల వివరాలను ప్రభుత్వం సంభందిత వెబ్ సైట్లో ఉంచుతుంది. ఇప్పటికే పలు పరీక్షలను కూడా పూర్తి చేసింది.. కాగా ఇప్పుడు సివిల్స్ మెయిన్ పరీక్షల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. 



ఎప్పుడో దరఖాస్తులు పూర్తి చేసిన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తాజాగా అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్షలు వచ్చే నెల ఎనిమిది నుంచి 17 తేదీల వరకు నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారు మెయిన్‌ పరీక్షను రాయనున్నారు. అక్టోబర్‌ 4న జరిగిన ప్రిలిమ్స్‌ పరీక్షలో మొత్తం 10,564 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మెయిన్స్‌ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. అడ్మిట్‌ కార్డులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లో అందుబాటు లో ఉన్నాయని వెల్లడించింది.



మరో విషయమేంటంటే.. సివిల్స్ ముగిసిన తర్వాతే ప్రిలిమినరీ మార్కులను విడుదల చేస్తామని ప్రకటించింది.ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ ను నిర్వహించనుంది. ప్రిలిమ్స్‌ మార్కులు, కటాఫ్‌ మార్కులు, కీని విడుదచేస్తామని యూపీఎస్సీ ప్రకటించింది. కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://upsc.gov.inలో పొందుపరుస్తున్నట్లు తెలిపింది. 2021 ఏడాదికి సంబంధించిన సివిల్స్‌ నోటిఫికేషన్‌ వచ్చే ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ప్రిలిమినరీ పరీక్షను 2021, జూన్‌ 27న, మెయిన్‌ ఎగ్జామ్‌ను 2021, సెప్టెంబర్‌ 17న నిర్వహించనుంది. ఇకపోతే కేంద్ర హోంశాఖ, ఆర్థిక, ఆరోగ్య శాఖ, ఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అందుకు సంబంధించిన దరఖాస్తు గడువు ఈ నెల 31 వ తేదీ వరకు ఉన్నట్లు వెల్లడించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: