గత ఐదు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే.. దీంతో బంగారం కొనే వాళ్ళ సంఖ్య కూడా భారీగా పెరిగింది.. రేట్లు ఇంకా తగ్గుతాయని అనుకున్న కొనుగోలుదారులకు ఇప్పుడు భారీ షాక్ తగిలింది.ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. రేట్లు ఒక్కసారిగా పెరగడంతో కొనుగోలు చేయాలని అనుకునేవాళ్లు నిరాశకు గురయ్యారు. ఈరోజు మార్కెట్ లోని రేట్లు మాత్రం కాస్త పెరిగాయి.. బంగారం రేటు పెరగడంతో, వెండి ధరలు కూడా పైకి కదిలింది.



అంతర్జాతీయ మార్కెట్ గోల్డ్ రేటు పూర్తిగా తగ్గినా కూడా హైదరాబాద్ మార్కెట్ లో రేట్లు మాత్రం చుక్కలను చూపిస్తున్నాయి. సోమవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న కేవలం పది రూపాయలు పెరిగిన ధర ఈరోజు మాత్రం కాస్త ఎక్కువ పెరిగింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పైకి కదిలింది. రూ.51,390కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.210 పెరుగుదలతో రూ.47,110కు పెరిగింది.



బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.200 పెరుగుదలతో వెండి ధర రూ.66,700కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగింది. వెండిని కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా భారీగా తగ్గింది.. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర మెరిసింది. బంగారం ధర ఔన్స్‌కు 0.03 శాతం పెరుగుదలతో 1873 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.14 శాతం పెరుగుదలతో 24.39 డాలర్లకు పెరిగింది.. సంక్రాంతికి బంగారం, వెండి ఆభరణాల పై డిమాండ్ పెరగడం తో ధరలు పెరిగాయి.. ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: