గత కొద్ది రోజులు గా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. నిన్నటి తో పోలిస్తే ఈరోజు రేట్లు భారీగా పైకి కదిలాయి. రోజుకో విధంగా బంగారం ధరలు మారుతున్నాయి.. ఈరోజు నమోదు అయిన రేట్లు మాత్రం అందరికీ షాక్ ఇస్తున్నాయి. బంగారం ధర పెరగడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. పసిడి పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం పెరగడం ఇందుకు ముఖ్య కారణం అని నిపుణులు అంటున్నారు. 



అంతర్జాతీయ మార్కెట్ తో పోలిస్తే హైదరబాద్ మార్కెట్ లో రేట్లు దూసుకుపోతున్నాయి..  ఈ రోజు ధరల విషయానికొస్తే.. హైదరాబాద్ మార్కెట్‌ లో గురువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 పైకి కదిలింది. రూ.49,960కు చేరింది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగింది. దీంతో రేటు రూ.45,800కు చేరింది. 


బంగారం పెరిగిన , తగ్గినా కూడా వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. ఈ రోజు కేజి వెండి రూ.600 పైకి ఎగసింది. దీంతో వెండి ధర రూ. 71,300కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.15 శాతం పెరుగుదల తో 1870 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.35 శాతం పెరుగుదలతో 25.85 డాలర్లకు పెరిగింది. బంగారం నిల్వలు ఉన్నా కూడా ధరలు మండిపోవడం తో పసిడి ప్రియులకు మింగుడు పడటం లేదు. మరి రేపు బంగారం , వెండి ధరలు ఏ విధంగా మారూతాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: