బంగారం కొనాలనుకునేవారికి షాకింగ్ న్యూస్.. ఈరోజు పసిడి ధరలు పైకి కదిలాయి. నిన్న మార్కెట్ లో ఉన్న ధరల తో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా పైకి కదిలాయి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా కూడా బంగారం ధరల లో మార్పులు వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ధరలు పెరుగుతూన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు..


ఇకపొతే గురువారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.47,700 ఉంది.. అదే విధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,040 గా నమోదు అయ్యింది.. కాగా.. 22 క్యారెట్ల రూ.1,000 లు పెరగగా,.. 24 క్యారెట్లపై రూ.1,090 మేర పెరిగింది. ఇకపోతే వెండి ధరలు కూడా రూ.2,200 మేర పెరిగింది. ప్రస్తుతం మనదేశంలో కిలో వెండి  ధర రూ. 67,200 గా ఉంది. దేశంలోని ప్రముఖ నగరాల్లొ పసిడి ధరలు ఎలా నమోదు అయ్యాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..


ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉంది, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040 వద్ద ఉంది.. కాగా, ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,040, చెన్నై లో బంగారం ధర 22 క్యారెట్ల రూ.48,800, 24 క్యారెట్ల ధర రూ.53,240 వద్ద నమోదు అవుతుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,040 ఉంది. బంగారం ధరల దారిలొనె వెండి ధరలు కూడా ఉన్నాయి. మరో వైపు బులియన్ మార్కెట్ లో కూడా అదే విధంగా బంగారం ధరలు పెరిగాయి. మార్కెట్ల వద్ద  కొన్ని పరిస్థితుల కారణంగా ధరలలొ మార్పులు కలుగుతున్నాయి. మొత్తానికి బంగారం ధరలు ఈరోజు నిరాశను కలిగిస్తున్నాయి. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: