ఇక పురుగు పట్టిన బియ్యాన్ని శుభ్రం చేయడం చాలా కష్టం. బియ్యం నుండి ఒక్కో పురుగును తీయడం ఇంకా చాలా కష్టం. వీటిని శుభ్రం చేయడానికి కూడా చాలా సమయం అనేది పడుతుంది. బియ్యం పురుగు పట్టాక శుభ్రం చేయడం కంటే పురుగు పట్టకుండా ముందుగానే జాగ్రత్త పడడం చాలా మంచిది.బియ్యం పురుగుపట్టడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అందులో ఖచ్చితంగా తేమ కూడా ఒకటి. బియ్యం నిల్వ చేసిన ప్రదేశం చుట్టూ లేదా ఆ ప్రదేశంలో తేమ ఉండడం వల్ల బియ్యం పురుగు పట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.కాబట్టి బియ్యాన్ని నిల్వ చేసే ప్రదేశం చుట్టూ మీరు తేమ లేకుండా చూసుకోవాలి. అలాగే ఇంగువను ఉపయోగించి కూడా మనం బియ్యం పురుగు పట్టకుండా చేయవచ్చు. ఇక దీని ఘాటైన వాసన కారణంగా బియ్యానికి పురుగులు పట్టకుండా ఉంటాయి. అలాగే ఇంగువ ముక్కలను లేదా పొడిని చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యంలో అక్కడక్కడ ఉంచాలి.



ఇలా చేయడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా బాగా ఉంటుంది.అలాగే కర్ఫూరాన్ని కూడా ఇదే విధంగా మూటలుగా కట్టి బియ్యంలో ఉంచడం వల్ల పురుగులు పట్టకుండా ఉంటాయి. ఇక బియ్యం పురుగు పట్టకుండా చేయడంలో వేపాకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే బియ్యాన్ని నిల్వ చేసుకునే డబ్బా అడుగు భాగాన వేపాకును ఉంచి ఈ వేపాకుపై బియ్యాన్ని పోయాలి లేదా వేప చెట్టు ఆకుల పొడిని మూటలుగా కట్టి బియ్యంలో ఉంచాలి. ఇక ఇలా చేయడం వల్ల కూడా ఇంట్లో బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది.అలాగే వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసి బియ్యంలో ఉంచడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది. బియ్యం పురుగుపట్టకుండా చేయడంలో లవంగాలు చాలా సమర్థవంతంగా పని చేస్తాయి. బియ్యంలో లవంగాలను ఉంచడం వల్ల లేదా లవంగాల పొడిని వస్త్రంలో కట్టి బియ్యంలో ఉంచడం వల్ల కూడా బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: