సాధారణంగా వేసవి కాలంలో ముఖంపై జిడ్డు ఎక్కువగా విడుదల అయి,మొటిమలు వాటి వల్ల నల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. ఆ మొటిమలను నల్లమచ్చలను పోగొట్టుకోవడానికి ఎంతో ఖర్చు పెట్టి,రకరకాల క్రీములను, లోషన్లను వాడుతుంటారు. అవి వాడినా,మొదట తగ్గినా,తర్వాత ముఖమంతా వ్యాపించి, మచ్చలు మచ్చలుగా తయారవుతుంది. కానీ సహజంగా దొరికే కొన్ని పదార్థాలను ఉపయోగించి తయారు చేసుకునే లేపనాల వల్ల తొందరగా మొటిమలు మచ్చలను తగ్గించుకోవచ్చు. మనం మసాలా దినుసుల్లో వాడుకునే జాజికాయ అందాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది సౌందర్యాన్ని ఎలా కాపాడుతుందో ఇప్పుడు చూద్దాం..

పూర్వం నుండి  జాజికాయను సౌందర్య ఉత్పత్తులలో ఎక్కువగా ఉపయోగించేవారు. ఇందులోని విటమిన్ సి,b6 ఐరన్,మెగ్నీషియం,క్యాల్షియం,సోడియం మరియు ఫైబర్ వంటి న్యూట్రియాంట్స్ పుష్కలంగా లభిస్తాయి.ఇవి ఆరోగ్యాన్ని పెంచడమే కాక అందానికి కూడా చాలా బాగా తోడ్పడతాయి .

చిట్కా 1:ముఖ లేపనం కోసం అరస్పూన్ జాజికాయ పొడి, అరస్పూన్ చందనం పొడి తీసుకొని,అందులో రోజ్ వాటర్ కలిపి మిశ్రమంలో తయారు చేసుకోవాలి. దానిని ముఖానికి లేపనంగా వేసి,అరగంట తర్వాత మర్దనచేస్తూ,గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా మాశ్చరైజర్ రాయాలి.  ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై జిడ్డు కారడం తగ్గి,మొటిమలు ముడతలు మచ్చలు తొందరగా తగ్గిపోతాయి.

చిట్కా 2: దీనికోసం ఒకస్పూన్ తేనె వేసి అందులో, ఒకస్పూన్ జాజికాయ పొడిని కలిపి, ముఖానికి లేపనంగా వేసుకోవాలి. ఈ మాస్క్ బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ఎలాంటి సోప్ వాడకుండా,శుభ్రం చేసుకోవాలి. తేనెలోని మాయిశ్చరైజింగ్ గుణాల వల్ల, చర్మం మీద మృతకణాలు తొలగి,మొటిమలకు,మచ్చలకు ఉపశమనం కలుగుతుంది.

చిట్కా 3: ఒక గిన్నెలో ఒకస్పూన్ జాజికాయ పొడి, తగినన్ని పాలు వేసి మిశ్రమంలో తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్ లాగ వేసి, శుభ్రం చేసుకుంటే సరి. పాలల్లోని లాక్టోజ్ గుణాలు చర్మాన్ని మొటిమలు, మచ్చలు పోగొట్టి,మృదువుగా తయారు చేయడంలో ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: