దక్షిణ భారతదేశీయుల ఆహారంలో చింత‌పండుకు ప్ర‌త్యేక‌మైన ప్రాధాన్య‌త ఉంది. చింత‌పండుతో చేసే ఏ ఆహార‌మైన ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు. ఎంద‌కంటే అంత రుచిగా ఉంటుంది కాబ‌ట్టి.  రసం, సాంబారు, రకరకాల పులుసులు, పచ్చడిలో చింతపండును ఉప‌యోగిస్తారు. అయితే సాధార‌ణంగా చాలా మంది చింత‌పండు మాత్ర‌మే ఉప‌యోగించుకుని అందులోని గింజ‌లు మాత్రం పారేస్తారు. కాని, చింతగింజ‌ల‌తోనూ ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి. మ‌రి అవేంటో తెలుసుకోండి.

 

 చింతగింజలను పొడి చేసి వాడడం వల్ల అద్భుత ప్రయోజనాలున్నాయి. చింతగింజలను పౌడర్‌ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల అజీర్ణం తగ్గుతుంది. పుచ్చులు లేని చింత గింజల్ని పెనంపై బాగా వేయించుకుని మంచి నీటిలో రెండు రోజుల పాటు నానబెట్టాలి. ప్రతి రోజు రెండు పూటలా నీటిని మారుస్తూ ఉండాలి. ఇలా నానిన చింతగింజలను పొట్టు తీసేసి మెత్తగా పొడిచేసి గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. చింత గింజల పొడిని రోజుకు రెండుసార్లు అరటీ స్పూన్ చొప్పున పాలు లేదా నీటితో చక్కెర కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

 

ఇలా తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, గొంతు సంబంధి సమస్యలున్నవారు ఈ పొడిని నీళ్ళలో కలుపుకుని తాగితే సమస్య తగ్గుతుంది. ఎముకలకి బలం ఇచ్చే శక్తి చింతగింజలకు ఉంది. ఎముకలు విరిగితే ఆ ప్రదేశంపై చింతగింజల పొడిని పేస్టులా చేసి అప్లై చేస్తే పరిష్కారమవుతుంది. అలాగే చింత గింజలు బాగా ఎండబెట్టి పొడిచేసి.. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా చింతకాయ విత్తనం పొడి కలిపి మౌత్ వాష్‌లా ఉపయోగిస్తే నోటి దుర్వాసన పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: