ఈ సమస్య తో బాధ పడేవాళ్లు చాలా ఎక్కువ మందే వున్నారు. ప్రతి 10 మందిలో నలుగురు ఈ సమస్యతో బాధపడుతున్నారని ఇటీవల ఒక సర్వే లో వెల్లడైంది. ఇక ఈ సమస్య ఎక్కువ ఆడవాళ్ళలో వస్తుంది. ఈ సమస్య తగ్గించుకోవాలంటే తప్పనిసరిగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి. మెడిటేషన్, యోగా వంటివి ఒత్తిడిని తగ్గించుకోవడం లో హెల్ప్ చేస్తాయి. హార్మోన్స్ బాలెన్స్డ్ గా ఉండాలంటే స్లీప్ సైకిల్ సరిగ్గా ఉండాలి. అప్పుడే నాచురల్ సర్కేడియన్ రిథం హార్మోన్స్ ని బాలెన్స్ చేస్తుంది. మీరు సస్టెయినబుల్ ప్రోడక్ట్స్ వాడుతూ, లేబుల్స్ జాగ్రత్తగా చదువుతూ, ప్లాస్టిక్ వాడకానీ మినిమైజ్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. మీరు రెగ్యులర్ గా స్కిన్ కేర్ ని ప్రాక్టీస్ చేసే వారైతే ఈడీసీ ఉన్న ప్రోడక్ట్స్ కి దూరం గా ఉండండి. ఈడీసీ అనే కెమికల్ ఎండోక్రైన్ ని డిస్రప్ట్ చేస్తుంది. ఈ కెమికల్ స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ ప్రోడక్ట్స్ లో కనబడుతుంది. ప్లాస్టిక్స్ లో ఉన్న బైసెఫనాల్స్ కూడా హార్మొనల్ ఇంబాలెన్స్ ని క్రియేట్ చేసి పీసీఓఎస్ లక్షణాలని తీవ్రం చేస్తాయి.
అలాగే ఈత, పరుగు, జాగింగ్, నడక, సైక్లింగ్ లాంటివి తప్పనిసరిగా చెయ్యాలి. మనిషి ఎంత ఫిట్ గా ఉంటే అంత మంచిది. ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండాలి. క్రమం తప్పకుండా డైలీ ఎక్సర్సైజులు చెయ్యాలి. అలాగే ఆహార పద్ధతుల్లో కూడా జాగ్రత్త వహించాలి. బయట దొరికే ఫుడ్ అసలు తినకూడదు. జంక్ ఫుడ్ అవాయిడ్ చెయ్యటం మంచిది. ఆకు కూరలు ఎక్కువ తినాలి. పాలు, గుడ్లు తినాలి. కాబట్టి ఈ పద్ధతులు పాటించి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి