కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆయా దేశాలు ఇంకా వాక్సిన్ తరహా ఔషధాలను కనిపెట్టడంలో బిజీగానే ఉన్నాయి. అలాగే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినవి కూడా లభించిన వారు వాడుతూనే ఉన్నారు. అమెరికా కూడా ముందస్తు జాగర్త లేకపోయినా ఇప్పటికైనా మేల్కొని ఆయా ప్రయోగాలు చేస్తూ విజయవంతం అవుతుంది. అయితే వీటికంటే మెరుగైనవి ఉన్నాయా అంటూ శాస్త్రవేత్తలు తమని తాము ప్రశ్నించుకుంటూ ఇంకా మేలైన వాటికోసం కష్టపడుతూనే ఉన్నారు. ఆ నేపథ్యంలోనే అమెరికాలో మోనోక్లోనల్ యాంటీబాడీల వైద్యం అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది వాక్సిన్ మాదిరి తక్కువకు లభించడం మాత్రం ఇప్పుడప్పుడే సాధ్యం కాకపోవచ్చు. అంటే ప్రస్తుతానికి ఇది పెద్దపెద్ద అధినేతలు మాత్రం వాడుతున్నారు.

గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రచారంలో ఉండగానే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఆయన క్వారంటైన్ లో లేకుండా వెంటనే మళ్ళీ ప్రచారానికి రావడంపై పలు విమర్శలు కూడా వచ్చాయి. దానికి కారణం అప్పుడు ఆయన వాడింది ఈ మోనోక్లోనల్ వైద్యమే. అందుకే త్వరగా ప్రజాక్షేత్రంలోకి వచ్చేశాడు. ఈ వైద్యంలో కేవలం గంటన్నరలో యాంటీబాడీలు అవి కూడా కరోనా ని నిలువరించగలిగినవి తయారవుతాయట. అందుకే ఆయన అంత త్వరగా బయటకు వచ్చేశాడు. అయితే అప్పుడే ఇది కనిపెట్టడం తో దానిని పరీక్ష చేయాల్సి ఉంది కాబట్టి ట్రంప్ తాను ఈ వైద్యం తీసుకున్నట్టు ప్రజలకు చెప్పుకోలేకపోయాడు.

ఇప్పుడు అది సత్ఫాలితాలు ఇస్తూ ఉండటంతో అమెరికాలో దానిని వీలైనంతమందికి అందించడానికి సిద్ధం చేస్తున్నారు. అమెరికాలో ఇంకా కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే అక్కడి అధికారులు ప్రజలకు ఈ ఖరీదైన మందును భరించగలిగిన అందరికి అందిస్తున్నట్టు తెలుస్తుంది.  ఆయా రాష్ట్రాల గవర్నర్ లు మోనోక్లోనల్ క్లినిక్ లు పెట్టి మరీ ప్రజలకు ఈ వైద్యం అందిస్తున్నారు. దీనితో అక్కడ వీలైనంత త్వరగా మాములు పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జులై నుండే దీనిని అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఇంకా పెద్దగా ప్రచారంలోకి తీసుకురాకపోవడానికి కారణాలు తెలియరావాల్సి ఉంది. ఇప్పటికే 27వేల డోసులు ఆయా వర్గాల కు అందించినట్టు అధికారులు తెలిపారు. దీనిని భవిష్యత్తులో అందరికి అందించడానికి అక్కడి ప్రభుత్వం 1100 కోట్లు ఇప్పటికే మంజూరు చేసింది. దాదాపు ఖర్చు కేంద్రం భరిస్తుందని కూడా తెలిపింది. ఇప్పుడిప్పుడే ఆయా రాష్ట్రాల నుండి ఈ వైద్యం కోసం దరఖాస్తులు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. మళ్ళీ అమెరికా తన స్థానాన్ని ఈ వైద్యం ద్వారా పొందిందా అంటే అవుననే అనాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: