ప్రపంచ వ్యాప్తంగా కిడ్నీ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అనేక ఇన్ఫెక్షన్లు ... ఆహారపు అలవాట్లు, క‌లుషిత నీరు ఇతర కారణాల వల్ల కిడ్నీ బాధితులు పెరిగిపోతున్నారు. ఆ తర్వాత డ‌యాల‌సిస్ చేసుకోవడం లేదంటే మరో కిడ్నీని అమర్చడం అత్యధిక ఖర్చుతో కూడుకున్న పని కావడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కిడ్నీ సంబంధిత వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న‌వారికి ఈ వార్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా పంది మూత్రపిండాన్ని మనిషికి అమర్చారు. ప్రస్తుతం అవయవాల కొరతతో బాధపడుతున్న నేపథ్యంలో ఇది పెద్ద ముందడుగు అని నిపుణులు భావిస్తున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన ఓ మ‌హిళ‌ రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. కానీ ఆమెకు కిడ్నీ దానం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. 

దాంతో కుటుంబ సభ్యుల ఆమోదంతో వైద్యులు కొత్త ప్రయోగానికి నాంది పలికారు. కుటుంబ సభ్యుల ఆమోదం మేరకు కొన్ని పరిశోధన తర్వాత సదరు మహిళకు పంది కిడ్నీ అమర్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. మూడు రోజులపాటు కొత్త కిడ్నీని మ‌హిళ ర‌క్త‌నాళాల‌కు జత చేశారు. మార్పిడి చేసిన తర్వాత మూత్రపిండాల పనితీరు పరీక్ష ఫలితాలు చాలా మెరుగ్గా కనిపించాయని ఈ ఆపరేషన్ చేసిన డాక్టర్  రాబర్ట్ మోంట్‌ గోమేరీ వెల్లడించారు. ఈ ప్రయోగం తర్వాత కొత్త ఆశలు చిగురించాయి అని వ్యాఖ్యానించారు. జెనో ట్రాన్స్ప్లాంటేషన్ క‌ల సహకారంతో ఇది కీలక అడుగు అని యునైటెడ్ థెరప్యూటిక్స్ సీఈవో మార్టిన్ రోత్‌బ్లాట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

భవిష్యత్తులో ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలను కాపాడే సమయం ఎంతో దూరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మార్పు చెందిన పందిని గాల్ సేఫ్ అని అంటారు. ఈ పందిని యునైటెడ్ యునైటెడ్ థెరప్యూటిక్స్ కార్పొరేషన్‌కు చెందిన రివైవికర్ యూనిట్ అనే పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసింది. ఈ పందిని మాంసం అలర్జీ ఉన్న వారికి తినిపించడానికి అదే విధంగా మానవ చికిత్స సంభావ్య వనరుగా ఉపయోగించడం కోసం 2020లో డిసెంబ‌రులో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

man