మన పూర్వీకుల నుంచి ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు కొనసాగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఏ సమయంలో ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనే దానిపై ఇప్పటికీ కూడా ఎంతో మంది కొన్ని నమ్మకాలు పెట్టుకుంటారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉదయం లేచిన సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు అంటూ సూచిస్తుంటారు నిపుణులు. కొన్ని రకాల వస్తువులను కానీ పరిసరాలను కూడా అస్సలు చూడవద్దు అని చెబుతూ ఉంటారు. అలా ఉదయం లేవగానే చూడకూడనివి చూస్తే మాత్రం ఇక అశుభం జరుగుతుంది అని భావిస్తూ ఉంటారు.. అయితే ఒకప్పుడు పెద్దలు చెప్పిన మాటలను నేటి రోజులలో చాలామంది కొట్టిపారేస్తూ ఉంటారు.


 సాధారణంగా సినిమాల్లో అయితే ఇక తమకు ఇష్టమైన వారి ముఖాన్ని రోజు పొద్దున్నే చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. పొద్దున లేవగానే ఇష్టమైన వారిని ముందుకు పిలిపించుకొని ముందుగా వారి ముఖాన్ని చూస్తూ ఉంటారు. అలా చూడటం వల్ల శుభం జరుగుతుందని భావిస్తూ ఉంటారు.. మరి కొంతమంది నిద్ర లేవగానే అద్దం లో తమ ముఖాన్ని తామే చూసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో ఒక అప్పటి ఆచారాలను పాటించే వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పాలి. నిద్ర లేవగానే  కొన్ని చూడకూడదు అని పెద్దలు చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్న వారు కూడా ఉన్నారు.



 ఈ రోజుల్లో ఇలా పెద్దలు చెప్పిన మాటలను మూఢ నమ్మకాలు అటు చాలామంది  కొట్టిపారేసిన.. కొంతమంది మాత్రం సీరియస్ గా ఫాలో అవుతున్నారు.. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్ర లేవగానే పాడైపోయిన వాచీ అస్సలు చూడకూడదట. అంతేకాకుండా లేచిన వెంటనే అద్దంలో చూసుకోవడం కూడా అశుభం అంటూ చెబుతూ ఉంటారు.. పెద్దలు  ఉదయం నిద్ర లేవగానే శుభ్రపరచని పాత్రలు చూస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి అంటూ చెబుతూ ఉంటారు. అంతేకాదు ఇక నిద్ర లేవగానే జంతువులను చూడటం కూడా మంచిది కాదు అని చెబుతూ ఉంటారు. ఇక ఉదయం నిద్రలేవగానే నీడను కూడా చూసుకోవడం అశుభం అంటూ చెబుతూ ఉంటారు. ఇక వాస్తు శాస్త్రం లో కూడా ఇవే ఉన్నాయట

మరింత సమాచారం తెలుసుకోండి: