ప్రపంచాన్ని కరోనా వనికిస్తున్న తరుణంలో అమెరికా శుభవార్త అందించింది. కరోనా రోగులు ఇంటినుంచే చికిత్స తీసుకునేందుకు మొట్టమొదటి కోవిడ్ మాత్రకు అమెరికా ఆమోదం తెలిపింది. ఫైజర్ సంస్థ తయారు చేసిన ఈ ఔషధం ఆ వైరస్ పై పోరాటంలో గేమ్ చేంజర్ గా అవుతుందని నిపుణులు చెబుతున్నారు ఈ మాత్ర ఓమిక్రాన్ పై ప్రభావం చూపుతుందా..? ఎవరైనా దీన్ని తీసుకోవచ్చా..? కరోనా పై పోరాటంలో అమెరికా కీలక మైలురాయిని చేరుకుంది. కోవిడ్ చికిత్సకు ఓ మాత్రను అధికారికంగా ప్రకటించింది. ఫైజర్ సంస్థ ప్యాక్స్ లోవిడ్ పేరుతో దీన్ని తయారుచేసింది. కరోనా బారినపడిన రోగులు ఈ మాత్రను తీసుకుంటే హాస్పిటల్ లో చేరాల్సిన 90 శాతం తగ్గుతుంది.

మరణం ముప్పు దాదాపు ఉండదు. ఇంతటి కీలక ఔషధాన్ని  అమెరికా వ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు వెలుగుచూస్తున్న విపత్కర పరిస్థితుల్లో ఫైజర్ మాత్ర గేమ్స్ చేంజర్ అవుతుందని భావిస్తోంది. అమెరికాలో కరోనా చికిత్సకు ఇప్పటివరకు యాంటీ బాడీ డాగ్స్ ను మాత్రమే వినియోగిస్తున్నారు. వీటిని ఐబి లేదా ఇంజెక్షన్ ద్వారా రోగులకు ఇస్తున్నారు.  వీటి ధర కూడా అధికం.ఫాక్స్ లోవిడ్ మాత్రతో కరోనా చికిత్స సులభతరం అవుతుంది. ఖర్చు కూడా చాలా తక్కువ.నోటి ద్వారా ఈ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. కరోనా సోకినా రోగులకు ఈ మాత్ర ఇస్తే వ్యాధి తీవ్రత గణనీయంగా తగ్గుతున్నట్టు ట్రయల్స్ లో తేలింది. ఆసుపత్రిలో చేరే అవకాశాలు 90% తగ్గుతాయి. వ్యాధి తీవ్రమైన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి  దాదాపు ఉండదు. మార్క్ తయారుచేసిన కరోనా మాత్ర మెన్యుపెరావెర్ కు కూడా అమెరికా  ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్ డీఎ ఆమోదం తెలిపింది. అయితే మెన్యూపేరావెర్ మాత్రకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫైజర్ మాత్రకు అంతగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఎఫ్ డీఎ అధికారులు వెల్లడించారు. వైరస్ సోకిన వారికి ఇంట్లోనే చికిత్స అందించేందుకు ఫైజర్ తో పాటు మెర్క్ మాత్రలను కూడా అత్యవసర సమయాల్లో అందించవచ్చని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లక్షా 80 వేల మందికి చికిత్స అందించేందుకు సరిపడా స్టాక్ మాత్రమే ప్రస్తుతం ఫైజర్ వద్ద ఉంది.ఇందులో 60 వేల నుంచి 70 వేల మందికి అవసరమైన ఔషధాలను అమెరికాకు కేటాయించింది.

వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాలకు వీటిని  సరఫరా చేయనుంది. మాత్రల తయారీకి తొమ్మిది నెలల సమయం పడుతుండడం వల్లే తక్కువ మోతాదులో ఔషధాలు ఉన్నాయని ఫైజర్ తెలిపింది. వచ్చే ఏడాది ఆ సమయం 50 శాతం వరకూ తగ్గిస్తామని పేర్కొంది. కోటి మంది చికిత్సకు సరిపడా ఔషధాలు సరఫరా చేయాలని ఫైజర్ తో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా లక్షణాలు బయటపడిన రోగులకు మూడు రోజుల్లోపు ఈ మాత్రను ఇవ్వగా 89 శాతం మందికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం తగ్గింది. 30 రోజుల పాటు నిర్వహించిన ఈ పరిశోధనలో ఒక్కరు కూడా మరణించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: