కానీ నోరూరించే ఈ వంటకానికి ఇలాంటి పేరు ఎలా వచ్చింది అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. కానీ అందరికీ ఈ డౌటు ఎప్పుడో ఓసారి వచ్చే ఉంటుంది. దీనికి ఆన్సర్ ఎవరు చెబుతారులే అని ఊరుకొని ఉంటారు అందరూ. కానీ ఇటీవలే రామ్ టేకే అనే ఒక ఇంస్టాగ్రామ్ యూజర్ వీడియో ఓ ద్వారా అందరి డౌట్ క్లియర్ చేసేసాడు. ఇటీవలే సదరు వ్యక్తి మాట్లాడుతూ తొలిసారిగా చికెన్ 65 పేరు ఎలా తెరమీదికి వచ్చింది అని చెప్పుకొచ్చాడు. చెన్నైలోని బుహరి హోటల్లో 1965లో ఈ డిష్ ప్రిపేర్ చేశారట. ఇలా 1965 లో మొట్టమొదటి సారిగా ఈ నోరూరించే డిష్ తయారు చేశారు కాబట్టి దీనికి చికెన్ 65 అని పేరు పెట్టారట.
ఇంతకీ ఈ బుహరి హోటల్ ఎవరిది అని అనుకుంటున్నారా... ఏఏం బహురి అనే ఒక చెఫ్ 1951లో ఈ హోటల్ ని స్థాపించాడు. ఇక్కడ చికెన్ తో ఒక సరికొత్త వంటకాన్ని తయారు చేయగా.. అది 1965లో తయారు కావడంతో దీనికి తయారైన సంవత్సరం పేరు జోడిస్తూ చికెన్ 65 అని పేరు వచ్చింది. చికెన్ 65 కి పేరు ఎలా వచ్చిందో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. ఏదేమైనా ఇన్ని రోజుల వరకు హాయిగా చికెన్ 65 వంటకాన్ని ఆరగించిన మాంస ప్రియులందరికీ కూడా ఇన్ని రోజుల నుంచి ఈ డిష్ కి ఈ పేరు ఎలా వచ్చింది అన్న డౌటు క్లారిఫై అయిపోయింది అని చెప్పాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి