పంచభూతాలలో నీరు కూడా ఒకటి. అంతే కాదు మనిషి జీవించడానికి నీరు ఎంతో ముఖ్యమైనది కూడా. అందుకే ఇక ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా కొన్ని లీటర్ల నీళ్లు తాగాలి అని అటు ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. లేదంటే శరీరం డీహైడ్రేషన్ కు గురి అయి అవయవాలు సరిగా పనిచేయవు అని చెబుతూ ఉంటారు. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా రోజంతా చురుగ్గా ఉండాలంటే క్రమం తప్పకుండా నీళ్లు తాగడం ఎంతో మంచిది అని అంటూ ఉంటారు. ఇలా వైద్య నిపుణులు చెప్పింది కొంతమంది కొట్టి పారేసినా.. మరికొంతమంది మాత్రం ఇక వైద్యుల సూచనలు పాటిస్తూ ఉంటారు.


 అయితే ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ ఉంచిన నీటిని అందరూ తాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. బయటికి వెళ్తే దుకాణంలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్న నీటిని కొనుక్కుంటారు. ఇక ఇంట్లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు నిల్వ ఉంచి తాగుతూ ఉంటారు. అయితే ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు నిల్వ ఉంచి తాగడం ఏమాత్రం మంచిది కాదు అని అటు నిపుణులు సూచిస్తూ ఉంటారు. కానీ జనాలు మాత్రం పట్టించుకోకుండా ఇలాగే చేయడం చేస్తూ ఉంటారు.  ఇంతకీ ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగితే ఏం జరుగుతుంది.. ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదం ఉందా అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


 నీళ్లు ఉన్న ప్లాస్టిక్ బాటిల్ లను ఎక్కువకాలం ఎండలో ఉంచితే దయాక్సిన్ అనే విష వాయువు వెలువడి ఇక నీళ్లలో కలిసి పోతుందట. ఇక ఇలాంటి నీళ్లను తాగితే రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేకాకుండా ఎక్కువ కాలం ప్లాస్టిక్ బాటిల్ లో నిల్వ ఉన్న నీరు తాగడం కూడా ఎంతో ప్రమాదకరం అంటూ చెబుతున్నారు.  ఇలా ఎక్కువ కాలం ప్లాస్టిక్ బాటిల్ లో నిల్వ ఉంచిన నీరు తాగితే బైఫినైనల్ అనే విషయం  రసాయన శరీరంలోకి చేరి మధుమేహం ఊబకాయం సంతానోత్పత్తి సమస్యలు కాలేయ సమస్యలు  పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గించటం లాంటివాటికి కారణమవుతోందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: