వేసవి కాలంలో నీరు అధికంగా ఉండే పండ్లను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో లిచి పండు కూడా ఒకటి. లిచి లో నీరు సమృద్ధిగా ఉంటుంది. ఇది చాలా రుచికరమైన పండు. ఇందులో కొన్ని పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. లిచి జీవక్రియ రేటును వేగవంతం పెంచేలా చేస్తుంది. అందుచేతనే బరువు తగ్గడానికి బాగా ఉపయోగ పడుతుంది. మీరు వేసవిలో లిచి తో చేసిన రసాన్ని తాగడం వల్ల మంచి లాభం కలుగుతుంది. లిచి పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి చూద్దాం.

1).లిచి లో ఫెస్టిక్ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది పేగులను చాలా శుభ్రంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తోంది. మలబద్ధకం, ఎసిడిటీ గుండెల్లో మంట వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది.

2).లిచి లో నీరు సమృద్ధిగా ఉంటుంది.. ఇందులో ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది. ఇది తక్కువ మొత్తంలో అని కేలరీలను కలిగి ఉంటుంది.. దీనిని తినడం వల్ల కడుపునిండినట్లు అనిపిస్తుంది కాబట్టి బరువు సులువుగా తగ్గుతారు.

3).లిచి లో మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఈ పోషకాలు ఎముకలను బలోపేతం చేయడానికి బాగా ఉపయోగపడతాయి.


4).లిచి లో రాగి ఎక్కువగా ఉండడం వల్ల ఇది జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయ పడుతుంది. మనం గొంతునొప్పిని వదిలించుకోవడానికి వీటిని తినవచ్చు.

5).లిచి లో బీటా కెరోటిన్, పోలేట్, నియాసిన్ వంటివి ఉండటం వల్ల.. ఇవి రోగనిరోధకశక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. లిచి పండు ని తిడుతూ ఉండడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా చర్మంపై నల్లటి వలయాలు మొటిమలను కూడా తొలగించుకోవచ్చు.

అందుచేతనే ఈ వేసవి కాలంలో ఈ పండు ని తరచూ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: