ఇక ప్రజలకు ఆరోగ్యం పట్ల.. వారు తినే ఆహారం పట్ల శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా కరోనా అనంతరం అయితే రోగనిరోధక శక్తిపై దృష్టి పెట్టడమే కాదు..ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తినడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక రోజు ఉదయం పూట తినే అల్పాహారంలో కూడా భిన్నంగా ఆరోగ్యంగా ఉండే ఆహారాన్ని తినడానికి ప్రయత్నించడం ప్రారంభించారు. ముఖ్యంగా రుచికరంగా పోషకాలు ఉండే ఆహారం తినడానికి బాగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలోని చాలా ప్రాంతాలలో అల్పాహారంగా తినే అటుకులు గురించి మనం తెలుసుకుందాం. ఇక ఈ అటుకులను దేశంలో వివిధ ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు. మధ్య ప్రదేశ్ ఇంకా ఢిల్లీ తెలుగు రాష్ట్రాలతో సహా అనేక ప్రాంతాల్లో పోహాని టిఫిన్ గా తీసుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఇండోరి పోహా పేరుతో స్టాళ్లను కూడా ఏర్పాటు చేయడం ప్రారంభించారు. కొంతమంది అటుకులను సలాడ్ ఇంకా మొలకలు కలుపుకుని మధ్యాహ్న భోజనంలో తింటారు. అయితే అన్నం కంటే.. అటుకులు చాలా ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడుతున్నాయి.



కొంతమంది అన్నం తినడానికి బాగా ఇష్టపడతారు.. కానీ రైస్ లో కొన్ని గుణాలు శరీరానికి బాగా హాని కలిగిస్తాయని.. కనుక రైస్ కి బదులు పోహాని తినమంటూ పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. పోహా రుచికరమైన ఇంకా అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చే సంపూర్ణ సమతుల్యతను ఇచ్చే దేశీ ఆహారం.ఇక అటుకులు గొప్ప లక్షణం ఏమిటంటే ఇవి కిణ్వ ప్రక్రియ ద్వారా తయారు చేయబడతాయి. అటుకుల్లో గ్లూకోజ్ గాని ఇంకా కొవ్వు పదార్దాలు కాని ఉండవు. పిండిపదార్థాలు, ఖనిజాలూ, విటమిన్లూ ఇంకా ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అటుకులలో ఫైబర్ అనేది అధికంగా ఉండడం వల్ల తొందరగా జీర్ణం అవుతాయి. దీంతో ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా బాగా సహాయపడతాయి.ఇక అటుకుల్లో ఇనుము అధికంగా ఉటుంది. గర్భిణీ స్త్రీలు ఐరెన్ లోపం లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఈ అటుకులను ప్రతి రోజూ కొంచెం మోతాదులో తినడం చాలా మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇక అటుకులకు నిమ్మరసం జత చేసి తినడం వలన విటమిన్ సి కూడా బాగా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: