
ప్రోటీన్..
ప్రోటీన్ అధికంగా ఉన్న మాంసం,గుడ్లు,పుట్టగొడుగులు వంటివి తీసుకోవడం వల్ల,సరైన పోషకాహాలు అంది గుండె కణజాలం పనితీరు మెరుగుపడుతుంది.దీనితో గుండెపోటు సమస్యలను దూరం చేసుకోవచ్చు.
మెగ్నీషియం..
మెగ్నీషియం అధికంగా ఉన్న ఆకుకూరలు, ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె కండరాలు దృఢంగా తయారై,గుండెపోటు సమస్యను దూరం చేస్తాయి.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్..
ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇది ఎక్కువగా బాదం, పిస్తా,వేరుశనగలు,గుమ్మడి విత్తనాలు,సన్ ఫ్లవర్ సీడ్స్ లలో ఎక్కువగా లభిస్తాయి.
తినకూడని ఆహారాలు..
గుండె మంటను కలిగించే మసాలాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. దీనివల్ల గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ తీవ్రతరమై గుండెపోటుకు దారితీస్తాయి.మరియు జీర్ణ సమస్యలు తలెత్తి,యువతకు చిన్న వయసులోనే గుండె సమస్యలు మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరియు జంక్ ఫుడ్స్ తినడం అవి సరిగా జీర్ణం కాక,అధిక బరువు వంటి సమస్యలు తలెత్తి గుండె సమస్యలను కలగజేస్తాయి.కావున మద్యపానం కి దూరంగా ఉండి, సరైన ఆహారాలు తీసుకొని,తగిన వ్యాయామాలు చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.