
వైట్ రైస్ రావడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది బియ్యం గింజలు తెల్లగా కనిపించడానికి ఎక్కువగా పాలిస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎక్కువ పోషకాలు అన్నీ కూడా బయటికి వెళ్లిపోతాయట. బ్రౌన్ రైస్ లో మాత్రం ఇలా జరగదు.. కేవలం పైన పాలిష్ మాత్రమే తొలగిస్తాయి అందుకే ఇందులో ఉండే పోషకాలు చాలా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
బ్రౌన్ రైస్ లో ఎక్కువగా ఫైబర్ ఉండడం వల్ల ఇది కడుపు నిండుగా అనిపిస్తుంది దీని చేత బరువు పెరగ కుండా ఉండడానికి వీలుకాకుండా ఉంటుందట.
బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఫాస్పరస్ మాంగనీస్ వంటి రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటివల్ల దీర్ఘకాలిక వ్యాధులనుంచి బయటపడవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రించడానికి బ్రౌన్ రైస్ చాలా రకాలుగా ఉపయోగపడతాయి.
వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ చాలా నెమ్మదిగా జీర్ణం అవ్వడం వల్ల షుగర్ అనేది పెరగకుండా ఉంటుందట టైప్-2 డయాబెటిస్ రోగులకు ఇది చాలా మంచిది.
బ్రౌన్ రైస్ లో మెగ్నీషియం ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది.
బ్రౌన్ రైస్ ఎక్కువగా మూత్రపిండ వ్యాధులు ఉన్నవారు కచ్చితంగా తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవట.
అందుకే ప్రతి ఒక్కరు వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ని తినడం చాలా మంచిది.