చాలా మంది కూడా యూరిన్ కి సంబంధించిన వ్యాధులతో ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజుల్లో యూరిన్ ఇన్ ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. మూత్రం రంగు ఇంకా వాసనల్లో మార్పులు వస్తున్నాయి. ఇంకా దీంతో పాటు కొందరిలో అయితే మూత్రంలో నురగ కూడా వస్తుంది. ఇలా మూత్రంలో నురగ రావడం వల్ల చాలా మంది కూడా చాలా ఆందోళన చెందుతూ ఉంటారు.మూత్రంలో నురగ రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఇలా మూత్రంలో నురగ వచ్చే వాళ్లు.. ఎక్కువగా టెన్షన్ పడొద్దని అంటున్నారు నిపుణులు.  మూత్రంలో నురగ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.చాలా మంది నీటిని తక్కువగా తాగుతారు.కేవలం దాహం వేస్తే తప్ప నీటిని తాగరు. ఇలా శరీరంలో నీటి కొరత తక్కువగా ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. నీటిని తక్కువగా తాగే వారికి.. మూత్రం అనేది పసుపు రంగులో వస్తుంది.ఇక ఆ తర్వాత నురగ వస్తుంది.ఇంకా అంతే కాకుండా శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండటం వల్ల ప్రోటీన్ మూత్రంలో కరిగి నురగ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి.కాబట్టి ఇలాంటి వారు వెంటనే డాక్టర్ ని సంప్రదించడం చాలా మేలు.


అలాగే కొంత మందిలో మూత్ర పిండల సమస్య కారణంగా కూడా మూత్రంలో నురగ వచ్చే ఛాన్సులు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా శరీరంలో నీటి శాతం తక్కువగా ఉన్న వారికి ఖచ్చితంగా కిడ్నీలో రాళ్ల సమస్య కూడా పెరుగుతుంది.అలాగే అమిలోయిడోసిస్ అనేది చాలా అరుదైన వ్యాధి. దీని వల్ల కూడా మూత్రంలో నురగ వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా అలాగే కొంత మందిలో దీని కారణంగా మూత్ర పిండాల సమస్యలు కూడా వస్తాయట.అలాగే షుగర్ వ్యాధి కారణంగా కూడా మూత్రంలో మార్పులు వస్తాయి.అందుకే మధు మేహంతో బాధ పడేవారికి పదే పదే మూత్రం ఎక్కువగా వస్తుంది. ఇంకా అంతే కాకుండా మూత్రంలో నురగ కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా మూత్ర సమస్యలతో ఇబ్బంది పడేవారు వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మేలు. లేదంటే ఖచ్చితంగా ఇవి పలు రకాల ఇన్ ఫెక్షన్ లకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: