
ముఖ్యంగా అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలలో కేరళ మొదటి స్థానంలో ఉందని. ఆ తర్వాత మహారాష్ట్ర 424, ఆ తర్వాత ఢిల్లీలో 494 కేసులు గుజరాత్ లో 223 కేసులు నమోదయ్యాయని తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కేసుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 16 తెలంగాణాలో మూడు కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.. అలాగే గోవాలో 7, మధ్యప్రదేశ్లో 10, జమ్మూ కాశ్మీర్ ,పంజాబ్ వంటి ప్రాంతాలలో నాలుగు కేసులు నమోదయ్యాయట. హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటివరకు ఒక్క యాక్టివ్ కేసు కూడా కనిపించలేదట.
ఈ నెలలోనే ఈ కరోనా మహమ్మారి వల్ల 7మంది మరణించారని ఆరోగ్య అధికారులు తెలియజేస్తున్నారు.. కరోనా దగ్గరికి రాకుండా పలు రకాల జాగ్రత్తలను తీసుకుంటూ ఉండడమే కాకుండా పౌష్టికమైన ఆహారాన్ని కూడా తింటూ ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బయటికి వెళ్లి వచ్చిన తర్వాత స్నానం చేయడం ముఖ్యమని.. శానిటైజర్ వంటి వాటిని ఉపయోగించడం మంచిదని తెలుపుతున్నారు. పిల్లలను, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు, వృద్ధులను వీలైనంత వరకు బయటికి పంపించకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు.