
మహేష్ బాబు జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు అయిన మహేష్ బాబు సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితులే. మహేష్ బాబు 1975 ఆగష్టు 9వ తేదీన జన్మించారు. అలనాటి సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ కుమారుడు అయిన మహేష్ బాబు...బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎంతగానో గుర్తింపు సంపాదించారు. బాలనటుడిగా దాదాపుగా ఎనిమిది పైగా సినిమాల్లో నటించిన మహేష్ బాబు ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి గుర్తింపు సంపాదించుకుని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు మహేష్ బాబు. ఇప్పటివరకు 25కు పైగా చిత్రాల్లో నటించారు మహేష్ బాబు. రాజకుమారుడు అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మహేష్ బాబు... మొదటి సినిమాలోనే ఉత్తమ నటుడి పురస్కారం కూడా అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన మహేష్ బాబు ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాశారు.
బ్రహ్మాజీ జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులే. ఈయన 1965 ఆగస్టు 9వ తేదీన జన్మించారు. కెరీర్ మొదటి నుంచి ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. సింధూరం సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బ్రహ్మాజీ... ఈ సినిమాకు ముందు నిన్నే పెళ్లాడతా అనే సినిమాలో కూడా నటించారు. ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన బ్రహ్మాజీ... తనదైన నటనతో విలక్షణ నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. పాత్రకు తగ్గట్టుగా బ్రహ్మాజీ చూపించే హావభావాలు తెలుగు ప్రేక్షకులు అందరిని కట్టిపడేస్తాయి అని చెప్పాలి.
రావు రమేష్ జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు దర్శకుడు అయిన రావు రమేష్ 1970 ఆగస్టు 9వ తేదీన జన్మించారు. ఈయన ప్రముఖ నటుడు రావుగోపాలరావు కుమారుడు. ప్రసిద్ధ స్టిల్ ఫోటోగ్రాఫర్ కావాలని అనుకున్న రావు రమేష్ తర్వాత కాలంలో నటుడిగా మారిపోయారు. ముఖ్యంగా గమ్యం చిత్రంలో రావు రమేష్ నటించిన నక్సలైట్ పాత్ర తన కెరీర్ని మలుపు తిప్పింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు రమేష్. పాత్రకు ప్రాణం పోసేలా నటిస్తూ తన హావభావాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తు ఉంటారు.
హన్సిక జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అయిన హన్సిక 1991 ఆగస్టు 9వ తేదీన జన్మించారు. తెలుగు తమిళం మలయాళం సినిమా ఇండస్ట్రీ లో ఎంతగానో గుర్తింపు సంపాదించారు హన్సిక. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించిన ఎంతగానో గుర్తింపు సంపాదించారు అంతే కాకుండా ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించారు హన్సిక. ఎంతమంది స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.
ఎల్లాప్రగడ సుబ్బారావు మరణం : భారతదేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులు ఎంతగానో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎల్లాప్రగడ సుబ్బారావు 1948 ఆగస్టు 9వ తేదీన మరణించారు. లెడ్లరి ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులు గా పనిచేసిన ఎల్లాప్రగడ సుబ్బారావు పోలిక్ ఆమ్లం యొక్క నిజస్వరూపాన్ని కనుగొన్నారు. అంతే కాకుండా ఎన్నో పరిశోధనలు చేసి గొప్ప శాస్త్రజ్ఞుడు గా ఎదిగారు ఎల్లాప్రగడ సుబ్బారావు.