పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని మ‌నంద‌రికి తెలిసిందే. ఇద్దురు మ‌నుషుల‌ను, మ‌నసుల‌ను ఏకం చేసే పెళ్లి.. ఒక తరానికీ మరో తరానికీ మధ్య సుమారు ఇరవై ఏళ్ల వ్యత్యాసం ఏంటుంది కాబట్టి.. ఐదు తరాల వరకు మూడు పూలు ఆరు కాయలుగా పెరుగుతూ.. మాధుర్యాన్ని పెంచి అందరికీ పంచేదనీ, వేద సంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటించేది.  ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రముఖ స్థానం ఉంది. భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి హాయిగా జీవించేందుకు ఎన్నోవ్రతాలు, నోములు, పూజలు, పరిహారాలు ఉన్నాయి. 

 

ఇవి అనాదిగా ఆచరింపబడుతూ దాంపత్య జీవనాన్ని పటిష్ఠంగానూ, సుఖమయంగా గడపేందుకు ఎంతో దోహదపడుతున్నాయి. అయితే వివాహంలో చేసే కొన్ని త‌ప్పుల వ‌ల్ల దంప‌తుల జీవితంలో ఇక్క‌ట్లు త‌ప్ప‌వంటున్నారు కొంద‌రు జ్యోతిష్యులు. అవేంటో చూడండి. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం వ‌ల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపిస్తుంద‌ట‌. 

 

మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం వ‌ల్ల మనోవైకల్యం,అన్యోన్యత లేకపోవటం, భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవ‌టం వంటివి జ‌రుగుతాయంటున్నారు జ్యోతిష్యులు. అలాగే బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం వ‌ల్ల మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి దంప‌తుల జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ట‌. మ‌రియు తలంబ్రాలకు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం వ‌ల్ల బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు వ‌స్తాయంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: