లాక్‌డౌన్‌లో ఎలా ఉండాలో శ్రీరాముడు అప్పుడే చెప్పాడా.. మరీ సుత్తి కొట్టకండి బాసూ అంటారా.. అనండి.. కాకపోతే శ్రీరాముడు యాజ్ ఇట్ ఈజ్ గా ఇలా చెప్పలేదు. కానీ ... ఒంటరిగా ఉనప్పుడు ఎలా ఉండాలి. ఒంటరి తనాన్ని ఎలా సద్వినియోగం చేయాలో చెప్పారు. 

 

 

ఆ విశేషం ఏంటంటే.. రామావతార సమాప్తి సమయంలో యమధర్మరాజు ముని వేషంలో వచ్చాడట. శ్రీరాముడితో ఏకాంతంగా సమావేశమయ్యాడట. ఆ సమయంలో రాముడు.. లక్ష్మణుణ్ని తమ ఏకాంతానికి భంగం వాటిల్లకుండా చూడమని ఆజ్ఞాపించాడట. 

 

 

అయితే మధ్యలో దుర్వాస మహాముని రాకతో శ్రీరాముడి ఏకాంత సమావేశం భంగమవుతుంది. ఆగ్రహించిన రాముడు లక్ష్మణుడికి నగర బహిష్కార శిక్ష విధిస్తాడు. ఏకాంతానికి అంతటి ప్రాముఖ్యత ఉందని రాముడు చెప్పకనే చెప్పాడన్నమాట. 

 

 

మనిషికి ఏకాంతం లభించినప్పుడు ఆత్మజ్ఞాన సిద్ధి సాధనకై ఆ సమయాన్ని వినియోగించుకోవాలంటారు పెద్దలు. ఎండుకట్టెలో అగ్నిని రగుల్కొల్పినట్లుగా, తమ హృదయాల్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మను ప్రకాశింపజేసుకోవాలి. అలా ఏకాంతవాసానికి ఎంతో శక్తి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: