క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. క‌రోనా అన్న ప‌దం ప్ర‌జ‌ల‌కు కామ‌న్‌ అయిపోయినా.. దీని భ‌యం మాత్రం త‌గ్గ‌డం లేదు. కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా విసృత్తంగా కొనసాగుతుంది. ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ కొనసాగిస్తున్నప్పటికీ.. మహమ్మారి విస్తరణకు అడ్డుకట్టవేయడం కుదరడం లేదు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 44 లక్షలకు చేరుకోగా, దాదాపు మూడు లక్షల మంది మరణించారు. 16 లక్షల మందికిపైగా కోలుకున్నారు. ఈ ప్రాణాంతకర‌ వైరస్ ధాటికి అగ్ర‌రాజ్యాలు సైతం కుదేల్ అవుతున్నాయి.

 

ముఖ్యంగా అమెరికా, యూకే, బ్రెజిల్ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇక లాక్‌డౌన్ కార‌ణంగా కుటుంబ స‌భ్యులంతా ఇంటిప‌ట్టునే అనివార్యంగా గ‌డ‌పాల్సిన ప‌రిస్థితి. అయితే శృంగార జీవితంపై క‌రోనా దెబ్బ గ‌ట్టిగానే ప‌డుతుందంటున్నారు నిపుణులు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. లాక్‌డౌన్ కార‌ణంగా ఉద్యోగాలు చేసే ప‌రిస్థితి లేక‌పోవ‌డం, ఆర్థిక రాబ‌డి నిలిచిపోవడం వంటి ప‌రిణామాల వ‌ల్ల‌ ప్రజలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి కారణంగా కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువ‌గా ఉత్పత్తి కావడం.. ఈ హార్మోన్ శృంగారంపై కోరిక‌ల‌ను త‌గ్గించ‌డంగానీ, లేదా పూర్తిగా కోరిక‌లు లేకుండా చేస్తుందని తెలిపారు. 

 

ఈ క్ర‌మంఓల‌నే శృంగారంపై గతంలో ఉన్న ఆసక్తివారిలో లేదంటున్నారు. ఈ మేర‌కు యునైటెడ్ కింగ్‌డ‌మ్‌కు చెందిన సెక్స్ అండ్ రిలేష‌న్‌షిప్స్‌ నిపుణురాలు అన‌బెల్లీ నైట్ వివ‌రించారు. అంతేకాకుండా.. లాక్‌డౌన్ వ‌ల్ల పిల్ల‌లు, పెద్ద‌లు ఇంటిప‌ట్టునే ఉండ‌డం వ‌ల్ల‌ శృంగారంలో పాల్గొనేందుకే ఏకాంతం దొరకడంలేదని చెప్పేవారు కూడా ఉన్నార‌ట‌. అలాగే లాక్‌డౌన్ వ‌ల్ల రోజంతా దంప‌తులు ఒకేచోట క‌లిసి ఉంటుండ‌టం కూడా వారిలో సాన్నిహిత్యం దెబ్బ‌తిని, ప‌ర‌స్ప‌రం ఇష్టాన్ని కోల్పోయి శృంగారానికి దూర‌మ‌య్యేలా చేస్తుంద‌ని అంటున్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ.. శృంగార జీవితంపై క‌రోనా ఎఫెక్ట్ గ‌ట్టిగానే ప‌డుతున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు.

 


  


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: