కోటి విద్యలు కూటి కొరకే అంటారు.. అయితే తినేటప్పుడు కొన్ని నియమాలను అనుసరించి తినాలని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు వంట తొందరగా అయ్యేందుకు అల్యూమినియం పాత్రలను వాడతారు. వాటిని వాడటం వల్ల అనేక నష్టాలు వాటిల్లుతాయని నిపుణులు అంటున్నారు. అల్యూమినియం పాత్ర యందు ఆహారాన్ని ఉడికించడం మూలాన ఆహారం నందలి ఆమ్లములు , అల్యూమినియం లోహము పైన ప్రభావం చూపి అనేక విషసంభంధ రోగాలకు ప్రధానకారణం  అవుతుందని నిరూపించారు.


చర్మ సంబంధ , నరాల సంబంధ సమస్యలు అధికంగా వచ్చును. శరీరం నందు కేన్సర్ కూడ వృద్ధిచెందును. ఆహారం ఉడికించడం తో పాటుగా ఆహారాన్ని తినడం కూడా ప్లేట్ లలో తింటున్నారు. అలా చేయడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. భుజించుటకు విస్తరాకులు వాడటం ఎంతో మంచిది . ఇప్పుడు మీకు ఎటువంటి ఆకులతో చేసిన విస్తరాకులలో తింటే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..


అరటి ఆకు..

ఇందు భుజించటం మిక్కిలి శ్రేష్టం. కఫవాతములను హరించును . బలమును , ఆరోగ్యమును పెంచును. శరీరకాంతిని , సంభోగ శక్తిని పెంచును. ఆకలిని , దంతకాంతిని కలిగించును. పైత్యశాంతిని కలుగచేయును. శ్లేష్మ సంబంధ దోషాలు పోవును . శరీరం నొప్పులు తగ్గించును . ఉదరము నందలి పుండ్లు అనగా పెప్టిక్ అల్సర్ ను నయం చేస్తుంది.


మర్రి ఆకు విస్తరి..

దీని యందు భుజించిన క్రిమి రోగ నివారణ , జఠరాగ్ని వృద్ది , కుష్ఠు వ్యాధి నివారణ అగును. నేత్రదోష నివారణ అగును. వీర్యవృద్ధి కలుగును.

పనస..

పనస విస్తరిలో భోజనం చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అగ్నివృద్ధి , పిత్తహర గుణములు ఉండును.

మోదుగ విస్తరి..

ఇందులో భుజించుటచే గుల్మరోగం , మహోదరం , క్రిమిరోగం , రక్తసంబంధ రోగాలు , పిత్తరోగములు నశించును. బుద్దిని పెంచును.

రావి విస్తరి..

ఇది పిత్తశ్లేష్మ నివారణ , అగ్నివృద్ది కలిగించును. వీర్యవృద్ధి కలుగచేయును . విద్యార్జనకు మనసును మళ్ళిస్తుంది అని విశ్వసిస్తారు.

వక్క వట్ట..

ఇది అగ్నివృద్ధిని కలుగచేయును . వాత,పిత్త రోగాలని హరించును . పైన చెప్పిన ఆకులలో భోజనం చేయడం వలన ఆయా ఆకులలో ఉండు ఔషధ గుణాలు అన్నియు మన శరీరం నందు చేరి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది..

అందుకే అప్పుడు అలా తినేవాళ్ళు ఇప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. సో మీరు కూడా స్టైల్ గా ప్లేట్ లలో తినడం కొంతవరకు తగ్గించి ఇలా ఆకులలో తినడం అలవాటు చేసుకోండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: