ఎక్కువగా చెప్పే టాప్ 5 అబద్దాల జాబితా కింది విధంగా ఉంది.
1. ఫోన్ సైలెంట్ లో ఉంది అందుకే చూడలేదు: ఈ సందర్భం పరివిధాలుగా ఉండొచ్చు. అయితే ఫోన్ తీయడం ఇష్టం లేనపుడు ఆ కాల్ ని ఇగ్నోర్ చేస్తాం. ఆ తరవాత దాని గురించి మాట్లాడాల్సి వస్తే ఫోన్ సైలెంట్ లో ఉంది చూడలేదు అని చాలా సింపుల్ గా చెప్పేస్తుంటారు. అవతలి వాళ్లకు అది అర్దం అయినా ఏమి అనలేరు పాపం.
2. అమ్మమ్మ చనిపోయింది : ఈ మాటను కూడా చాలా సార్లు విని ఉంటారు. నిజానికి చాలా మంది ఉపయోగించే ఉంటారు. ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారు ఎక్కువగా ఇది ఉపయోగిస్తూ ఉండవచ్చు. సెలవు కావాలంటే చాలు చాలా మంది లేని అమ్మమ్మను కూడా చంపేస్తుంటారు పాపం. అలా పలు సందర్భాల్లో ఈ అబద్దం చెబుతుంటారు.
3. ఇదే నా లాస్ట్ పెగ్ : మందు బాబులు తరచూ చెప్పే లాజికల్ మంత్రం ఇది. చాలా మంది ఇదే నా లాస్ట్ పెగ్ ఇక జీవితంలో దీని జోలికి వెళ్ళాను అంటారు. కానీ....ఆ తర్వాత మీకు తెలిసిందే. ఒక్కసారి మందు మత్తులో చిక్కుకుంటే ఇక జీవితాంతం దాని పాదాక్రాంతమే.
4. రెండు నిముషాల్లో వస్తున్నా: ఈ మాట ఎన్నిసార్లు వినుంటారో అసలు లెక్కే ఉండదు అనిపిస్తుందా? చాలా మంది ఈ చిన్ని అబద్ధాన్ని సునాయాసంగా వాడేస్తున్నారు. ముఖ్యంగా భార్యామణులకు భర్తలు ఎక్కువగా చెప్పే అబద్దమే ఇది.
5. నా దగ్గర పైసా కూడా లేదు: జేబులో ఎంత ఉన్నా పైసా కూడా లేదంటూ చాలా సింపుల్ గా అబద్దం ఆడేస్తారు కొందరు. వాస్తవానికి నిజం చెబితే ఎవ్వరూ ఏమీ అనుకోరు. కానీ ఇలా తన డబ్బులు ఇవ్వడానికి కూడా అబద్దాలు ఆడడం అవసరమా?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి