ఉసిరికాయతో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. ఉసిరిలో వుండే విటమిన్‌ -సి ఎంతో మేలు చేస్తుంది. అనేక వాతావరణ మార్పుల వల్ల కలిగే హర్మోన్‌లోని వ్యత్యాసాన్ని పూడ్చడానికి ఇంకా అలాగే జలుబు లేదా దగ్గును నివారించడానికి ఉసిరికాయ ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.మలబద్దకం ఇంకా మధుమేహం వంటి వ్యాధులున్నవారికి ఎంతో మేలని, ఎన్నో రకాల వ్యాధులను తగ్గించేందుకు ఈ ఉసిరికాయ ఉపయోగపడుతుంది. ఉసిరి తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు ఈజీగా నియంత్రించబడతాయి. ఉసిరి కాయ తినడం వల్ల చర్మ సమస్యలు, జట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇక ఇందులో సి విటమిన్ ఉండటం వల్ల చర్మ వ్యాధుల నివారణకు సహాయపడుతుంది.ఉసిరి కాయలో నారింజ పండ్ల కన్నా 20 శాతం ఎక్కువ విటమిన్‌ పోషకాలు అనేవి ఉంటాయి. ఉసిరి కాయ చర్మపు ముడుతలను సైతం నివారిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎంతగానో అవసరం. ఇది రక్తాన్ని బాగా శుభ్రం చేస్తుంది. మన తరచూ ఉసిరి కాయని తీసుకున్నట్లయితే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.


ఇక మనం నేరుగా ఉసిరిని ఎక్కువగా తినలేము కాబట్టి, దీనిని ఆహారంలో ఉడకబెట్టడం లేదా పచ్చడి చేయడం ద్వారా కూడా తినవచ్చు. అలాగే తేనెతో కూడా తినవచ్చు. ఖాళీ కడుపుతో ఉసిరిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో మంచిదని చెబుతున్నారు వైద్యులు.బరువు తగ్గేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఇక ఉసిరి జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రించుకోవచ్చు. ఇది శరీర బరువును అదుపులో ఉంచడానికి బాగా సహాయపడుతుంది. అలాగే, ఈ రసంని రోజూ తాగడం వల్ల డయాబెటిస్ సమస్యను ఈజీగా తొలగించుకోవచ్చు. అలాగే ఉసిరి కాయ రసం చర్మంపై నల్లటి మచ్చలను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖం మీద ఉసిరి రసంని ఉంచడం వల్ల రంధ్రాలు ఈజీగా పోతాయి. అలాగే వేసవి వేడి నుంచి ఉపశమనం పొందడం కోసం ఉసిరి రసం తాగడం మంచిది. ఈ ఉసిరి రసం కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: