తమ పిల్లలు వయసు తగ్గట్టు ఉండాల్సిన ఎత్తు కంటే తక్కువ ఎత్తు ఉన్నారని తల్లితండ్రులు బాధపడుతుంటారు.ఆ పిల్లలు కూడా నలుగురితో కలవాలన్నా ఇబ్బంది పడుతుంటారు.కానీ ఎత్తు పెరగకపోవడానికి కొన్ని జీన్స్ పరమైన కారణాలు ఉండవచ్చు.ఇంకొంతమందికి పోషకాహార లోపం ఉండవచ్చు. కానీ ఈ సమస్య తీరడానికి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.ఆ పదార్థాలెంటో ఇప్పుడు చూద్దాం..


 కొన్ని ఆహారపదార్థాలు ఎత్తు పెరగడానికి దోహదం చేస్తాయి. కొంతమంది పిల్లలు సరిగా తినక వారికి సరైన పోషకాహారం అందదు. అలాంటివారు సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల ఎత్తు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు . అయితే, దానికి కొన్ని నియమాలు ఉంటాయని చెబుతున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ 21 ఏళ్ల వరకూ పొడవు పెరుగుతారు.ఈ వయసు దాటితే ఎత్తు పెరగడం ఆగిపోతుంది. ఆ వయసు లోపే ఏదయినా మంచి ఆహారం పిల్లలకు ఇవ్వాలి.

1.పిల్లలు ఎత్తు పెరగడానికి కాల్షియం  చాలా అవసరం.క్యాలిషియం ఎక్కువగా సోయా ఉత్పత్తులలో లభిస్తుంది. పిల్లల ఎత్తు పెరగాలనుకునేవారు సోయా బీన్స్, మిల్క్‌ వంటివి రెగ్యులర్‌గా ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

2).అందరికి అందుబాటులో కాల్షియం వున్న ఆహారం పాలు.వీటితో పాటు పాలలో విటమిన్ డి, ప్రోటీన్స్ పుష్కళంగా ఉంటాయి. కాబట్టి రోజూ వారి డైట్ లో పిల్లలకు పాలు తాగడం వల్ల పొడవు పెరుగుతారని వైద్య నిపుణులు సూచిస్తారు.

3).పిల్లలు ఎత్తు పెరగడానికి ప్రోటీన్స్ కూడా చాలా అవసరం.చికెన్, మటన్ వంటి ప్రోటీన్ రిచ్ పుడ్ ఎక్కువగా ఇస్తువుండాలి.ఇందులో ఉండే ప్రోటీన్స్ వల్ల కండరాల బలంగా తయారవడానికి బాగా ఉపయోగపడతాయి.రోజూ ఒక గుడ్డు పెట్టడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది.

4).బెండకాయల్లో విటమిన్స్, ఫైబర్, పైబర్ మినరల్స్ పుష్కళంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల ఎత్తు పెరుగుతారని వైద్య నిపుణులు అనేక పరిశోధనలు చేసి మరి నిరూపించారు.

5).ఆకు కూరల్లో ముఖ్యంగా బచ్చలి కూర తినడం వల్ల  ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కళంగా అంది,దీని వల్ల హైట్ బాగా పెరుగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: