ఇప్పుడున్న పొల్యూషన్, ఆహార అలవాట్ల వల్ల చాలామంది ఎక్కువగా జుట్టు రాలిపోవడం, చుండ్రు,చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు.ఇటువంటి సమస్యలు తగ్గించుకోవడానికి రకరకాల షాంపూలు, సిరంలను వాడుతుంటాము.ఈ కెమికల్ ప్రోడక్ట్ లు సమస్యలను తగ్గించకపోగా, అనేక దుస్ప్రభావాలు కలిగిస్తోంది.కానీ ప్రకృతి ప్రసాదించిన కొన్ని రకాల పదార్థాలను వాడి సహజంగానే ఇంట్లోనే తయారుచేసుకునే హెయిర్ సీరమ్ ఈ సమస్యలను తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అది ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

కలోంజి సీడ్స్ తో తయారుచేసుకొని సీరమ్ జుట్టుకు చాలా బాగా ఉపయోగపడతుంది.అలాగే జుట్టు పెరుగుదలకు సైతం కలొంజి విత్తనాలు ఎంతో బాగా సహాయపడతాయి.ఈ విత్తనాలతో ఎలా హెయిర్ సీరంను తయారు చేసుకోవాలో చూద్దాం..

దీనికోసంముందుగా మిక్సీ జార్‌ తీసుకుని, అందులో రెండు స్పూన్లు కళోంజి సీడ్స్ వేసి,మెత్తని పొడిలా మీక్సీ పట్టుకోవాలి.ఆ తర్వాత  ఒక ఉల్లిపాయను తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అ తర్వాత స్టవ్ పై మందం పాటి కడాయి పెట్టి, అందులో అరకప్పు వరకు కొబ్బరి నూనె తీసుకొని,దీనితో పాటు పైన చెప్పినవన్నీ వేసి బాగా ఊడికించుకోవాలి. అ నూనె కలర్ మారిన తరవాత అ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. దీనిని జాగ్రత్తగా గాజు సీసాలో భద్రపారుచుకోవాలి.

దీనిని అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇందులో ఒక స్ఫూన్ అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేసి జుట్టుకు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి, గంట పాటు వదిలివేయాలి. అ తర్వాత మైల్డ్ షాంపూ తో శుభ్రం చేసుకుంటే సరి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చుండ్రు తగ్గడం,జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతే కాక జుట్టు ఒత్తుగా, నల్లగా మెరుస్తూ పెరగడానికి కూడా ఈ న్యాచురల్ సీరం చాలా బాగా ఉపయోగపడుతుంది.దీనితో పాటు మంచి డైట్ తీసుకోవడం వల్ల కూడా జుట్టు బాగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: