
గింజలలో ఉండే ఆరోగ్యకరమైన ఫ్యాట్లు గుండె జబ్బుల ముప్పు తగ్గిస్తాయి.బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రించే మెగ్నీషియం, పొటాషియం కూడా అందిస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. ఈ గింజల్ని పొడి చేసి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది. చర్మం మరియు జుట్టుకు ఆరోగ్యం.గింజలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. జింక్, ఐరన్ జుట్టు పెరుగుదలకి సహాయపడతాయి. ఇందులో ఉండే లైసిన్, అర్జినైన్ అనే అమైనో యాసిడ్లు పురుషుల హార్మోన్ స్థాయులను సమతుల్యం చేస్తాయి.
స్పెర్మ్ కౌంట్ పెంచడంలో కూడా సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ B సమూహం, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు రక్తహీనతను తగ్గించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. నేరుగా వేపుకుని తినవచ్చు – సన్నగా వేయించి తినటం వల్ల కరకరలాడుతూ టేస్టీగా ఉంటుంది.పొడి చేసి అన్నంలో కలుపుకోవచ్చు లేదా చట్నీలో, సూపుల్లో వేసుకోవచ్చు. స్మూథీ ల్లో లేదా ప్రోటీన్ పౌడర్ రూపంలో కూడా ఉపయోగించవచ్చు. గింజలు తినేముందు బాగా శుభ్రం చేసి, ఎండబెట్టిన తర్వాత వాడాలి. పుచ్చకాయ తినడం ఎవరూ మిస్ చేయరు. ఇకపై గింజలు కూడా వదలకుండా వాడితే, ఆరోగ్యంపై చక్కటి ప్రభావం చూపవచ్చు. సహజంగా, ఖర్చు లేకుండా లభించే ఈ అద్భుత గింజల ప్రయోజనాల్ని తప్పక ఉపయోగించండి.