
చక్కెర తినడం మానేస్తే శరీరంలో అనేక ఆరోగ్యకరమైన మార్పులు కనిపించటం మొదలవుతుంది. ముఖ్యంగా బరువు తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటం, చర్మం తళతళలాడటం వంటి ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తాయి. చక్కెరలో అధికంగా కేలరీలు ఉండటం వలన, దాని వినియోగాన్ని తగ్గించడం ద్వారా రోజువారీ కేలరీలు తక్కువవుతాయి. దీని ప్రభావం బరువు తగ్గడంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగవడం డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. అధిక చక్కెర తీసుకోవడం వల్ల చర్మంపై దుష్ప్రభావాలు ఉంటాయి. చక్కెర తక్కువగా తీసుకుంటే మొటిమలు తగ్గుతాయి, చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి మెరుగవడం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. అంతేగాక, అధిక చక్కెర సేవనంతో సంబంధం ఉన్న నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
చక్కెరను మానేయడం వల్ల తేలికపాటి అఘటానాలు మొదట్లో ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి విసుగు, మానసిక అసహనం, ఏకాగ్రత లోపం, జ్ఞాపకశక్తి తగ్గినట్టు అనిపించడం, నిద్రలేమి, ఆందోళన వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవన్నీ తాత్కాలికమైనవే. శరీరం కొత్త పరిస్థితికి అలవాటుపడిన తర్వాత ఈ లక్షణాలు తగ్గిపోతాయి. కొన్ని రోజులకు శరీరం లోపల నిజమైన మార్పులు మొదలవుతాయి. శరీరంలో కొవ్వు కరుగుతుంది, శక్తి స్థాయి పెరుగుతుంది, శరీరం మరింత చురుకుగా మారుతుంది. మనం గతంలో అనుభవించని శారీరక శక్తిని గమనించవచ్చు.
ఇలా చూస్తే, చక్కెరను మానేయడం మొదట కొంత ఇబ్బందిగా అనిపించినా, కొద్ది రోజుల తర్వాత దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా గొప్పవిగా ఉంటాయి. తక్కువ సమయంలోనే మన శరీరంలో స్పష్టమైన మంచి మార్పులు మొదలవుతాయి
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు