
మినప్పప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో శక్తి స్థాయిలను పెంచడానికి మరియు రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. పురుషులకు రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన శక్తిని అందిస్తుంది. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి కండరాల నిర్మాణానికి మరియు బలానికి చాలా అవసరం. కండరాలు దృఢంగా ఉండటానికి మినప్పప్పు సహాయపడుతుంది.
మినపప్పులో కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకలను బలంగా, దృఢంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలను నివారించడంలో కూడా తోడ్పడుతుంది. ఇది నాడీ వ్యవస్థను బలపరుస్తుందని, నాడీ బలహీనత, పాక్షిక పక్షవాతం, ముఖ పక్షవాతం వంటి రుగ్మతల నివారణకు ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారని తెలుస్తోంది.
మినపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మినప్పప్పులో ఉండే ఫైబర్ మరియు ఇతర పోషకాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి, ఇది మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మినపప్పులోని మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం మరియు ఇతర పోషకాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు