
ఎవరి నుంచైనా సరే సహాయం పొందిన సమయంలో మనం వాళ్లకి "థాంక్స్" అని చెప్తూ ఉంటాం. "థాంక్స్" అనే పదాన్ని ఉపయోగించి వాళ్ళు చేసిన పనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పదాని వాడుతూ ఉంటాం. ఇది చాలా మంది చేస్తూ ఉంటారు . పలు సందర్భాలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు . అయితే "థాంక్యూ" అని కూడా కొన్ని సందర్భాలలో వాడుతూ ఉంటాం. "థాంక్యూ" అనే పదం మనం ఎవరో తెలియని వ్యక్తులకి లేకపోతే మనకంటే వయసులో పెద్దవారైన వారికి మాత్రమే వాడుతూ ఉంటాం.
"థాంక్స్" అనే పదాన్ని మనం మనకి తెలిసిన వాళ్ళకి మన కుటుంబ సభ్యులకి మన స్నేహితులకి మనతో బాగా దగ్గరైన వ్యక్తులకి పలు సందర్భాలలో కృతజ్ఞతలు తెలియజేసే దానికి ఈ థాంక్స్ అన్న పదం వాడుతూ ఉంటాం . థాంక్స్ ఇది అనధికారికగా రూపం . అంటే మనం మనకు దగ్గరైన వ్యక్తులు మన తెలిసిన వ్యక్తులకి కృతజ్ఞతలు తెలియజేసే పదం . థాంక్యూ ఇది అధికారిక రూపం . అంటే మనకంటే పెద్దవాళ్లతో ..గౌరవప్రదంగా లేదా మనకి తెలియని వ్యక్తులకు ఉద్యోగ సంబంధాలలో ..ఉద్యోగ సంభాషణలలో గౌరవం పాటిస్తూ తెలిపే విధంగా ఈ థాంక్యూ ని వాడుతూ ఉంటాం..!!
1. థాంక్స్ (Thanks): ఇది అనధికారిక (informal) రూపం. మనకు తెలిసిన వ్యక్తులకు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు, దగ్గరైన వ్యక్తులకు కృతజ్ఞత తెలియజేసేటప్పుడు వాడతాం.
ఉదాహరణలు:
"Thanks a lot!"
"Thanks, రా!"
"Thanks, Buddy!"
2. థాంక్యూ (Thank you):
ది అధికారిక (formal) రూపం. మనకంటే వయసులో పెద్దవారికి, తెలియని వ్యక్తులకు, ఉద్యోగ సంబంధాలలో, క్లయింట్స్, బాస్, ఆఫీసులో రిక్వెస్ట్ లేదా మెయిల్ పంపేటప్పుడు వాడతాం. ఇది గౌరవాన్ని చూపే రూపం.
ఉదాహరణలు:
"Thank you for your assistance."
"Thank you for your time."
"థాంక్స్" .. తేలికైన, స్నేహపూర్వక కృతజ్ఞత
"థాంక్యూ" .. ఘనమైన, గౌరవపూర్వక కృతజ్ఞత
అర్థం ఒకటే అయినా, వాడే సందర్భం మరియు అందించే గౌరవం పరంగా తేడా ఉంటుంది.