వారణాసి మూవీ ఈవెంట్లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు రోజురోజుకి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన గతంలో మాట్లాడిన పాత వీడియోలను కూడా వెలికితీస్తూ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ చేస్తున్నారు.అయితే తాజాగా రాజమౌళి గతంలో మాట్లాడిన ఒక పాత వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోని కరెక్టు టైం లో నెటిజన్స్ షేర్ చేస్తున్నారు. ఇక వీడియోలో ఏముందంటే..రాజమౌళి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో మాట్లాడుతూ.. నాకు దేవుడు అంటే నమ్మకం ఉండదు. కేవలం నేను 4 యోగాలను మాత్రమే నమ్ముతాను. ఇక ఈ నాలుగు యోగాల్లో కర్మయోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం, రాజయోగం వీటిలో ఒక భక్తి యోగంలో మాత్రమే దేవుడు ఉంటాడు. మిగిలిన మూడు యోగాలలో దేవుడు ఉండడు. కాబట్టి నేను కర్మ యోగాన్ని నమ్ముతాను. 

అందుకే నా పని నేను చేసుకుంటూ వెళ్తాను.మిగతాదంతా ఏది జరగాల్సి ఉంటే అదే జరుగుతుంది. నేను నాస్తికుడిని..దేవున్ని నమ్మను. కానీ మా నాన్న మాత్రం దేవున్ని నమ్మమని చెబుతాడు.నాన్న చెబితే నేను అస్సలు వినను. అమ్మ చెబితే వింటారు కానీ మా అమ్మ ఈ విషయాలు చెప్పదు. ఇక పెళ్లయిన సమయంలో నా భార్యకు అప్పుడప్పుడు బాబుని మంత్రాలయం తీసుకువెళ్ళు అని చెప్పేది.ఆ సమయంలో నా భార్యతో కలిసి మంత్రాలయం వెళ్ళాను. ఇక గుళ్లు  అవన్నీ చాలా కమర్షియల్. డబ్బు కోసమే అలా చేస్తారు. గుడిలో టెంకాయ కొట్టడానికి కూడా డబ్బులు తీసుకుంటారు. అదంతా వాళ్లు డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్నారు.అది పెద్ద బిజినెస్.

నాకు ఇప్పటికి కూడా భక్తి లేదు. కానీ అప్పుడప్పుడు ఎవరు లేనప్పుడు గుడికి వెళ్లి ప్రశాంతంగా గడుపుతాను. గతంలో మా అన్నయ్య నన్ను శ్రీశైలం దగ్గర్లో ఉండే బసవేశ్వరాలయానికి తీసుకువెళ్లారు.ఆ సమయంలో ఎవరూ లేరు.నది ప్రవాహం ఆ పక్కనే సన్నగా మైక్ లో మా అన్నయ్య కంపోజ్ చేసిన పాటలు వింటూ చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలాంటి వాతావరణాన్ని మాత్రమే నేను కోరుకుంటాను. ఇక నా మెడలో ఉన్న వినాయకుడి లాకెట్ ని మా వదినే ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ఇచ్చింది.దాన్ని అలాగే వేసుకున్నాను అంటూ రాజమౌళి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారు.అయితే అప్పటి పాత వీడియో మళ్లీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారడంతో మరొకసారి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: