తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అజిత్, విజయ్ లు మంచి పేరు తెచ్చుకున్నారు.  వారితో పాటు ‘గజిని’ లాంటి బ్లాక్ బస్టర్ తో హీరో సూర్య కూడా విపరీతమైన మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఇక సూర్య తమ్ముడు కార్తీ ‘యుగానికొక్కడు’ చిత్రంతో తెలుగులో ఎంట్రీనే అదిరిపోయింది.  తర్వాత తెలుగు లో కార్తీ నటించిన అవారా, శకుని, ఊపిరి, కాశ్మోరా లాంటి చిత్రాలతో అలరించాడు. ఇందులో ఊపిరి చిత్రం మనోడికి ఎంతో మంచి పేరు తెచ్చింది.  తాజాగా కార్తీ నటించిన ‘ఖాకి’ టీజర్ రిలీజ్ అయ్యింది. 
Image result for హీరో కార్తీ  ‘ఖాకి’ టీజర్
ఇందులో ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన వాయిస్ వినిపిస్తుంది.. వంద కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో నాలుగు వేలి ముద్రల్ని పట్టుకుని కేసును ఎలా ఛేదిస్తావ్ అంటూ ఓ అధికారి హీరోను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది.  తర్వాత ఏడారిలో కార్తీ..మట్టిలో నుంచి లేవడం చూస్తుంటే..సినిమా యాక్షన్ మూవి అనిపిస్తుంది.  సాధారణంగా పోలీస్ స్టోరీలు చాలా వరకు సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ గానే రూపొందుతాయి. 
Image result for హీరో కార్తీ  ‘ఖాకి’ టీజర్
ఇంతకుముందు తమిళంలో ‘శతురంగ వేట్టై’ తీసిన వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది. ఇది వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా అంటున్నారు. 
Image result for హీరో కార్తీ  ‘ఖాకి’ టీజర్
కెమెరా రిచ్‌గా ఉన్న ఈ టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ని సంగీత దర్శకుడు గిబ్రాన్ అదరగొట్టాడు. మొత్తానికి ‘ఖాకి’ సత్తా చాటేందుకు సరికొత్తగా వస్తున్న కార్తీ ఈ మూవీతో మంచి హిట్‌ని అందుకోవాలని చూస్తున్నాడు. ఈ టీజర్ చూస్తుంటే కార్తీ కోరిక తీరేలానే ఉంది. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తాలు ఈ సినిమాకి నిర్మాతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: