టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోయిన్ సమీరారెడ్డి అనేక సినిమాలు చేయటం జరిగింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి అశోక్ ఇంకా అనేక సినిమాలలో నటించింది. అంతేకాకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన జై చిరంజీవ సినిమాలో కూడా యాక్ట్ చేసింది. సౌత్ ఇండస్ట్రీలో తమిళంలో కూడా నటించిన సమీరారెడ్డి సూర్య తో నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో అద్భుతమైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది.

Image result for sameera reddy

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమీరా రెడ్డి సూర్యతో కలిసి నటించిన రొమాంటిక్ సీన్లు ఇప్పటికి కూడా ప్రేక్షకులను రక్తి కట్టిస్తాయి. అయితే ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసిన పెద్దగా మెప్పించలేకపోయింది. కొన్నాళ్లకు తెలుగు తమిళంలో కూడా సినిమాలు చేసిన బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడటంతో సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంది. 

Image result for sameera reddy

అయితే ఇప్పుడు సమీరారెడ్డి తల్లి కావడంతో త్వరలో డెలివరీ కాబోతున్న నేపథ్యంలో తన కోసం ప్రార్థించండి అంటూ సోషల్ మీడియాలో అభిమానులను కోరుకుంది. డెలివరీ డేట్ దగ్గర పడటంతో ప్రసవం సులువుగా అయ్యి తల్లి పిల్ల ఇంటికి ఆరోగ్యంగా రావాలని దేవుడిని కోరుకోమని అభిమానులకు సమీరా రెడ్డి తెలియజేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: