యంగ్ హీరో నితిన్ న‌టించిన `శ్రీనివాస క‌ల్యాణం` ఆయ‌న కెరీర్‌లోనే అత్యంత డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స‌తీష్ వేగ్నేష్‌తో క‌ల్యాణ్‌రామ్ ఇటీవ‌ల `ఎంత మంచి వాడ‌వురా!` చిత్రం చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ కూడా ఎప్పుడు వ‌చ్చిందో ఎప్పుడు వెళ్లిందో తెలియ‌కుండానే థియేట‌ర్ల‌లోంచి వెళ్లిపోయింది. సంక్రాంతికి వ‌చ్చిన నాలుగు చిత్రాల్లో ఈ చిత్రం మంచి హిట్ చిత్రంగా నిలుస్తుంది అనుకున్నారంతా ఎందుకంటి మంచి ఫ్యామిలీ కాన్సెప్ట్‌తో క‌నిపించిన ఈ చిత్రం లాస్ట్ లో క్లైమాక్స్ చెడ‌గొట్టేశాడు. అంతేకాక కామెడీ కూడా పెద్ద‌గా తీయ‌లేదు. మ‌రి ఇలాంటి చిత్రాలు ఏ విధంగా వ‌ర్క్ అవుట్ అవుతుంది అనుకున్నాడో ఏమో తెలియ‌దుగాని మొత్తానికి క‌ల్యాణ్‌రామ్ న‌మ్మి అవ‌కాశ‌మిస్తే ఆ ద‌ర్శ‌కుడు నిలువునా ముంచేశాడ‌నే చెప్పాలి.

 

 అప్పుడు ఒక ఫ్లాప్ డైరెక్ట‌ర్ కి అవ‌కాశం ఇచ్చి క‌ల్యాణ్‌రామ్ త‌ప్పు చేశాడ‌ని అంతా అన్నారు. మ‌ళ్లీ ఇదే త‌ర‌హా త‌ప్పుని క‌ల్యాణ్‌రామ్ చేస్తున్న‌ట్టు తెలిసింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా `డిస్కోరాజా` చిత్రాన్ని వి.ఐ.ఆనంద్ తెర‌కెక్కించాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా అడ్ర‌స్ లేకుండా పోయింది. నిర్మించిన నిర్మాత‌కు కూడా భారీ న‌ష్టాల‌ని మిగిల్చింది. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ ఇటీవ‌ల క‌ల్యాణ్‌రామ్‌కు క‌థ వినిపించార‌ట‌. కొత్త‌గా వుండ‌టంతో క‌ల్యాణ్‌రామ్ ఓకే చెప్పార‌ని తెలిసింది.

 

అయితే ఈ విష‌యం తెలిసిన వాళ్లు మాత్రం క‌ల్యాణ్‌రామ్ మ‌ళ్లీ చేసిన త‌ప్పే మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాడ‌ని ఆయ‌న ఫ్యాన్స్ అంద‌రూ ఆవేద‌న చెందుతున్నారు. అయితే క‌ళ్యాణ్‌రామ్ మంచి అందం అభిన‌యం ఎంతో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరో అయిన‌ప్ప‌టికీ ఎందుకోగాని కాలం క‌లిసిరావ‌డం లేదు. క‌థ‌ల ఎంపిక‌లో తేడానో లేక అస‌లు ద‌ర్శ‌కుల‌ను ఎంపికే తేడానో అర్ధం కావ‌డం లేదు. ప‌టాస్ త‌ర్వాత క‌ళ్యాణ్‌రామ్ చిత్రం ఒక్క‌టీ హిట్ కాలేద‌నే చెప్పాలి. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో ఎంతో ఓర్పుగా చూసి అడుగులు వేస్తే చాలా బావుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: