ప్రేమ‌మ్ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన మ‌లయాళ బ్యూటి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ఈ భామ ఎన్నో చిత్రాల్లో న‌టించింది కానీ ఆశించినంత క్రేజ్ మాత్రం ఈ భామకు ల‌భించ‌లేదు. అయితే ఇటీవ‌లె రాక్ష‌సుడు చిత్రంలో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌తో క‌లిసి న‌టించింది. ఆచిత్రం హిట్ అయింది. కానీ అది అనుప‌మ‌కి మాత్రం పెద్ పేరేమి రాలేదు. ఇక ఈ మధ్య కాలంలో ఆమెకు పెద్దగా సినిమాలు అయితే ఏమీ లేవ‌నే చెప్పాలి. దీంతో మిగ‌తా హీరోయిన్ల‌లాగానే ఈ భామ కూడా సోష‌ల్ మీడియాని హీటెక్కించ‌డం మొద‌లు పెట్టింది.

 

ఇక మ‌ల‌యాళ బ్యూటి అయిన‌ప్ప‌టికి తెలుగు హీరోయిన్ల‌కి ఏమాత్రం త‌గ్గ‌కుండా  చాలా  ట్రెండీగా పాత్ర‌ల‌ను ఎంచుకుంట‌ది ఈ భామ‌. అంతేకాక ఈమె డ్ర‌స్సింగ్ స్టైల్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించిన అన్ని పాత్ర‌లు కూడా దాదాపు అలానే ఉన్నాయి. మ‌రి ఇప్పుడు ఈ భామ దేనికైనా రెడీ అంటోంది. ఎక్స్‌పోజింగ్ కూడా ఏమాత్రం వెన‌కాడ‌న‌న్న‌ట్లు ఈమె హాట్ ఫొటోస్‌తో చెప్ప‌క‌నే చెబుతుంది. అయితే ఈ మ‌ధ్య కాస్త అవ‌కాశాలు త‌గ్గితే చాలు దాదాపు ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లంతా చేసే ప‌ని అదే. అలాగే అనుప‌మ కూడా అదే బాటలో వెళుతుంది. త‌న హాట్ హాట్ ఫొటో షూట్‌ల‌తో సోష‌ల్ మీడియాని వేడెక్కిచేస్తుంది.

 

ఇక అనుప‌మ‌కి ఎక్కువ‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆమె హైట్ అని కూడా కొంద‌రు అంటున్నారు. ఆమె పొట్టిగా ఉండ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా అంద‌రి ప‌క్క‌న హీరోయిన్‌గా సెట్ అవ్వాలంటే అవ్వ‌లేదు కాబ‌ట్టి ఆమెను కొన్ని సినిమాల‌కే ఎంచుకుంటున్నారు. ఇక ఈ మ‌ధ్య అయితే మాత్రం ఈ భామ ఫేడ్ అవుట్ అయిపోయింద‌నే చెప్పాలి. మ‌రి క‌నీసం ఈ ఫొటోలు చూసైనా స‌రే ద‌ర్శ‌కులు ఆమెకు అవ‌కాశాలు ఇస్తారేమో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: