ఇటీవలే బాలీవుడ్ ఇండస్ట్రీ పై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దాదాపుగా బాలీవుడ్ లో 99 శాతం మంది డ్రగ్స్ వాడుతున్నారు అంటూ వ్యాఖ్యానించి సంచలనం సృష్టించింది. కంగనా రనౌత్ వ్యాఖ్యల ను టాలీవుడ్ నటి బిజెపి నాయకురాలు మాధవిలత సమర్థిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం బాలీవుడ్లో నే కాదు టాలీవుడ్ లో కూడా డ్రగ్స్ వాడకం ఎక్కువ గానే ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాధవిలత.




 ఈ మేరకు ఆమె ఫేస్బుక్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. సుశాంత్ కేసులో  నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అడుగు పెట్టడం ఎంతో మంచిదని... డ్రగ్స్ వాడకం అతిగా ఉంది అన్నది కూడా నిజమే అంటూ వ్యాఖ్యానించిన మాధవిలత... సుశాంత్ కేసు లో అదిగో ఇదిగో అంటూ చివరికి తుస్సు మనిపిస్తారేమో అన్న అనుమానం కూడా కలుగుతుంది అంటూ  తెలిపారు. భారత్ లో ఉన్నవి తినడం తాగడం చేస్తే బాగుంటుంది అంతేకానీ విదేశీ మాదకద్రవ్యాల ఎందుకు అంటూ ప్రశ్నించింది మాధవిలత.



 ఈ సందర్భంగా టాలీవుడ్ లో డ్రగ్స్  వాడకంపై స్పందించిన మాధవిలత... తెలుగు ఇండస్ట్రీ లో కూడా డ్రగ్ వాడకం ఎక్కువ గానే ఉంది అంటూ తెలిపింది. కొన్ని సార్లు డ్రగ్స్  లేకుండా అసలు పార్టీలే జరగవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది . టాలీవుడ్ లో డ్రగ్స్ వాడే అందరినీ బయటకు లాగేందుకు ఒక ఆఫీసరు వచ్చినప్పటికీ పొలిటికల్ అండతో అతన్ని వెనక్కి లాగారు అంటూ తెలిపింది. అధికారి నోరు నొక్కి చివరికి వేరే శాఖకు పంపించేసారు  అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది . ఇక ఈ పోస్ట్ పెట్టిన తర్వాత తనకు కూడా బెదిరింపులు వచ్చే అవకాశం ఉంది అంటూ తెలిపిన మాధవి లత.. డ్రగ్స్ మాఫియా పై మరిన్ని సెటైర్లు వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: