బాలక్రిష్ణ సీనియర్ మోస్ట్ హీరో అయిపోయాడు. ఆయన 14 ఏళ్ళకే బాలనటుడిగా అడుగు పెట్టాడు. మూడు రోజుల క్రితం బాలయ్య్ 46 ఏళ్ల సినీ ప్రస్థానంలోకి అడుగుపెట్టాడు. నిజం చెప్పాలంటే  1974   నుంచి నేటి వరకూ ఏ ఒక్క ఏడాది వేస్ట్ కాకుండా కచ్చితంగా నటిస్తూ వస్తున్న అచ్చమైన నటుడు బాలయ్య. ఇక బాలయ్య షస్టి పూర్తి ఈమధ్యనే పూర్తి చేసుకున్నాడు. ఆయన ఇంకా అదే జోష్ తో సినిమాలు చేస్తున్నాడు.

ఇపుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో మూవీ సెట్స్ మీద ఉంది. దీని తరువాత కూడా మూడు నాలుగు సినిమాలు బాలయ్య ముందు రెడీగా ఉన్నాయి. అంటే రానున్న మూడేళ్ల పాటు బాలయ్య  రెస్ట్ లేకుండా సెట్స్ మీదనే ఉంటారన్న మాట. ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య ఎన్టీయార్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. తన తరువాత కుమారుడు మోక్షజ్ఞను వారసుడిగా పరిచయం చేయాలనుకుంటున్నాడు.

అయితే ఇది అంతకంతకు ఆలస్యం అవుతోంది. మిగిలిన నటుల వారసులు అంతా ఇరవయ్యేళ్లకే ఇండస్ట్రీకి పరిచయం అవుతూంటే బాలయ్య కొడుకు మాత్రం పాతికేళ్ళు దాటినా ఇంకా తెరంగేట్రం చేయడం లేదు. ఈ నేపధ్యంలో బాలయ్య రేపూ మాపూ మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం అంటూ చెబుతూ వస్తున్నారు కానీ దానికి తగినట్లుగా మోక్షజ్ఞ నుంచి సానుకూల  సంకేతాలు రావడంలేదు.

మరో వైపు చూసుకుంటే హరిక్రిష్ణ కుమారుడుగా జూనియర్ ఎన్టీయార్ ఎంటీయార్ మూడవ తరానికి నట వారసుడుగా ఉంటున్నారు. బాలయ్య ఇప్పటిదాకా జూనియర్ తో కలసి సినిమా చేయలేదు. నేను మల్టీ స్టారర్ చేస్తే మోక్షజ్ఞ తోనే చేస్తాను అని చెబుతున్నాడు. అంతే కాదు నందమూరి  వారి నట వారసత్వం మొత్తం ముందుకు తీసుకెళ్ళే బాధ్యత మోక్షజ్ఞ అని కూడా ఆ మధ్య ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అంటే బాలయ్యకు జూనియర్ ఎన్టీయార్ మూడవ తరం నట వారసుడిగా ఉండడం ఇష్టం లేదా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే ఆయన్నే ఆదరిస్తాం కదా నందమూరి ఫ్యాన్స్ చెబుతున్నారు. మరి ఆ పని చేయక  బాలయ్య సినీ ఇండస్ట్రీలో  నందమూరి వారి వారసత్వాన్ని అలా అయోమయంలో పడేశారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: