టాలీవుడ్ లో చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు .. ప్రతి  డైరెక్టర్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది .. వాళ్ళు తీసిన సినిమాలు విజయాలు సాధించకపోయినా టాలెంట్ మాత్రం చాలా ఉంటుంది .. అలాంటిది టాలీవుడ్ లో టాలెంటెడ్ దర్శకులు ఎవరు అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం .. మొదటగా ఇంద్రగంటి మోహనకృష్ణ  ఈయన గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. గ్రహణం లాంటి జాతీయ అవార్డు సినిమాతో దర్శకుడిగా మారిన ఇంద్రగంటి .. ఆ తర్వాత అష్టా చమ్మా, అంతకుముందు ఆ తర్వాత, గోల్కొండ హై స్కూల్, జెంటిల్‌మెన్, అమీ తుమీ లాంటి సినిమాలు చేసాడు. ఎన్ని విజయాలున్నా కూడా ఇంద్రగంటి మోహనకృష్ణకు రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు. తాజాగా విడుదలైన వి సినిమాతో అంచనాలు అందుకోలేకపోయాడు ఇంద్రగంటి... మరో డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ఐతే లాంటి  సినిమాతో  దర్శకుడిగా మారిన యేలేటి.. ఆ తర్వాత కూడా అలాంటి సినిమాలే చేసాడు. విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ఈయన ఖాతాలో ఒక్కడున్నాడు, సాహసం లాంటి సినిమాలున్నాయి. కానీ గుర్తింపు మాత్రం రావడంలేదు ..

మరో దర్శకుడు శేఖర్ కమ్ముల  ఆనంద్ సినిమాతో విజయం అందుకుని . గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా లాంటి సినిమాలతో దర్శకుడిగా విజయాలు అందుకున్నారు.ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమాతో వస్తున్నాడు శేఖర్ కమ్ము
అల్లరి సినిమాతో దర్శకుడిగా మారిన రవిబాబుకు స్టార్ హీరో పడితే అద్భుతాలు చేస్తాడు. కానీ ఇప్పటి వరకు ఆయన కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదు. నీలకంఠ ఈ దర్శకుడి పేరు విన్నట్లు ఉంది కదా అప్పట్లో షో లాంటి సినిమాతో నేషనల్ అవార్డులు గెలుచుకున్నాడు నీలకంఠ. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఆయనకు గుర్తింపు మాత్రం తీసుకురాలేదు. మరో డైరెక్టర్ దేవా కట్టా వెన్నెల సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా.. ప్రస్థానం ఆయన పవర్ ఏంటో చూపించింది. కానీ ఆ తర్వాత దేవా కట్టాకు కోరుకున్న గుర్తింపు రాలేదు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సినిమాతో బిజీగా ఉన్నాడు . అందాల రాక్షసి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు హను రాఘవపూడి  అటు తర్వాత కొన్ని చిత్రాలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు . ఇక మరో అవార్డు విన్నింగ్ డైరెక్టర్  ప్రవీణ్ సత్తారు  రాజశేఖర్ లాంటి ఔట్ డేటెడ్ హీరోతో కూడా గరుడవేగ లాంటి సూపర్ సినిమా చేసాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: