సంక్రాంతికి నాలుగు మూవీస్‌ వస్తున్నాయి. సినిమా పండక్కి ఇంకా 15 రోజులు కూడా లేదు. ఎవరికివాళ్లు విడుదల తేదీలు  ప్రకటించేసుకున్నారు. 13 నుంచి 15 వరకు కంటిన్యూస్‌గా సినిమాలే సినిమాలు.

సంక్రాంతి రేసులో విజయ్‌ మాస్టర్‌తో.. రామ్‌ రెడ్‌తో... రవితేజ క్రాక్‌తో.. బెల్లంకొండ శ్రీనివాస్‌ ' అల్లుడు అదుర్స్‌'తో వస్తున్నాడు. విజయ్‌ మూవీని తెలుగు, తమిళంతోపాటు.. హిందీలో కూడా రిలీజ్‌ చేయడంతో.. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా మాస్టర్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. ముందుగా ఈక్రేజీ ప్రాజెక్ట్‌ను సంక్రాంతికి నాలుగైదు రోజులు ముందే.. 8నగానీ.. 9నగానీ రిలీజ్‌ చేస్తే భారీ ఓపెనింగ్స్ రాబట్టవచ్చన్న ప్లాన్‌ వేసినా.. కుదర్లేదు. ఎట్టకేలకు 13న రిలీజ్‌ అంటూ.. విడుదల తేదీ ప్రకటించేశారు.

రజినీకాంత్‌ డ్రాప్‌ కావడంతో..  విజయ్‌ పార్టీ పెడతాడంటూ.. తమిళనాట వార్తలొస్తున్నాయి.  విజయ్‌ తండ్రి ఇప్పటికే పార్టీ పేరును రిజిష్టర్‌ చేయించడం.. హీరో కొన్ని రోజులుగా సమావేశాలు ఏర్పాటు చేయడం... ముఖ్యమంత్రి పళని స్వామిని కలవడంతో... తమిళనాట విజయ్‌ పాలిటిక్స్‌ ఊపందుకున్నాయి.  నెలాఖరున  జయలలిత సమాధి దగ్గర పార్టీ ఎనౌన్స్‌ చేస్తారన్న వార్తలొస్తున్నా.. ఇందులో నిజం లేదట. మాస్టర్‌ రిలీజ్‌ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి 50 పర్సెంట్‌ ఉన్న ఆక్యుపెన్సీని 100 పర్సెంట్‌కు పెంచాలంటూ... విజయ్‌ కోరాడట.

సంక్రాంతికి తమిళంలో పెద్ద సినిమాలు లేకపోవడం మాస్టర్‌కు కలిసొచ్చింది. అయితే.. తెలుగులో మాత్రం రెడ్‌.. క్రాక్‌..అల్లుడు అదుర్స్ ప్రభావం మాస్టర్‌ కలెక్షన్స్‌పై పడుతుంది. విజయ్ అదిరింది మూవీతో తెలుగులో తొలి హిట్‌ అందుకున్నా.. విజిల్‌తో మరో సక్సెస్‌ కొట్టాడంటే.. అప్పట్లో కాంపిటీషన్‌ లేదు. అయితే.. ఈ సారి నెలకొన్న  పోటీని ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి. 13న మరో సినిమా లేకపోవడం కలిసొచ్చే అంశమే అయినా.. 14న రెండు సినిమాలు రెడ్‌, క్రాక్‌ రావడంతో.. మాస్టర్‌కు థియేటర్స్‌ తగ్గనున్నాయి. మొత్తానికి సంక్రాంతికి వచ్చే సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: